Saturday, May 9, 2015

న్యాయం.

ముంబైలోని సతారాకు చెందిన రవీంద్ర  పాటిల్‌కు 25 ఏళ్లు. కష్టపడి కానిస్టేబుల్ అయ్యాడు. ముంబై పోలీసు విభాగంలో ఉద్యోగం. ఆ వెంటనే స్పెషల్ ఆపరేషన్ స్క్వాడ్(ఎస్‌వోఎస్)లో కమాండోగా చేరేం దుకు శిక్షణ. సరిగ్గా ఇదే సమయంలో సల్మాన్‌కు అండర్ వరల్డ్ ముఠాల నుంచి బెదిరింపులు రావడంతో ముంబై పోలీసు విభాగం.. పాటిల్‌ను సల్మాన్‌కు బాడీగార్డ్‌గా పంపింది. 2002 సెప్టెంబర్ 28న సల్మాన్ కారు ప్రమాదం రోజున పాటిల్ అదే వాహనంలో ఉన్నాడు. మద్యం మత్తులో ఉన్నందున కారు నడపొద్దని సల్మాన్‌ను పాటిల్ వారించినా వినలేదు.కారు బయల్దేరిన కాసేపటికే అమెరికా ఎక్స్‌ప్రెస్ బేకరీ సమీపంలోని ఫుట్‌పాత్‌పై పడుకున్నవారిపైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. సల్మాన్ ఖాన్ తన కారు ను ఫుట్ పాత్ పైకి ఎక్కించి ఒకరి మృతికి నలుగురి గాయాలకు కారణ మైన సంఘటనకు ప్రత్యక్ష సాక్షి  రవీంద్ర.  బాడీగార్డ్‌లా కాకుండా ఓ పోలీసులా వ్యవహరించిన పాటిల్ వెంటనే బాంద్రా స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఎఫ్‌ఐఆర్‌లో జరిగింది జరిగినట్టు చెప్పాడు. దీంతోసల్మాన్‌పై కేసు నమోదైంది. ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు కోర్టులో కూడా పాటిల్ సాక్ష్యమిచ్చాడు.

ఆ సాక్షంతో అతని జీవితమే మారిపోయింది. పోలీసు డిపార్ట్ మెంట్ ఎస్ ఓఎస్ ఉద్యోగం నుంచి తప్పించింది. అన్ని వైపుల నుండి పాటిల్ పై తీవ్రమైన వత్తిడులొచ్చాయి. చివరకు స్వంత డిపార్ట్ మెంట్ నుండి కూడా తీవ్రమైన వత్తిళ్ళు వచ్చాయి . పోలీసు డిపార్ట్ మెంట్ మొత్తం ఆయనను ఒంటరిని చేసింది.ఆ వత్తిళ్ళు తట్టుకోవడం ఆయన వల్ల కాలేదు . దాంతో ఉద్యోగానికి కూడా దూరమయ్యాడు. చివరకు ముంబయ్ నుండి దూరంగా వెళ్ళిపోయాడు. అదే సమయంలో సల్మాన్ కేసు విచారణకు వచ్చింది . ఇతను కోర్టుకు రాలేదు.దాంతో కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది .పోలీసులు పాటిల్ ను అరెస్టు చేసి జైలుకు పంపారు. డిపార్ట్ మెంట్ డిస్మిస్ చేసింది. అక్కడే ఆయనకు టీబీ సోకింది.ఆయన జైలు నుండి విడుదలయ్యే సరికి జుట్టు రాలిపోయి ,చిక్కిశల్యమై ఎవ్వరూ గుర్తుపట్టకుండా తయారయ్యాడు.భార్య విడాకులు తీసుకొని వెళ్ళిపోయింది. కొద్దిరోజులు రోడ్డుపై బిచ్చమెత్తుకుంటూ తిరిగాడు. ఆతర్వాత సెవ్రీ లోని టీబీ ఆస్పత్రిలో చేరి 2007, అక్టోబర్ 4న కన్నుమూశాడు. ఆయన నిజాయితీనే ఆయనను కాటికి పంపింది. సల్మాన్ హిట్ అండ్ రన్ కేసు చివరకు ఆయన చావుకు కారణమయ్యింది.

 బాలీవుడ్ ప్రముఖులంతా సల్మాన్ పైనే  జాలి చూపిస్తున్నారు . కానీ  మీడియాలో సల్మాన్ గురించే మాత్రమే వార్తలొస్తున్నాయి .ఈ కేసులో న్యాయం కోసం తన యవ్వనాన్ని, జీవితాన్ని ఫణంగా పెట్టిన ఈ కేసు ముఖ్య సాక్షి గురించి ఎవ్వరూ  పట్టించుకోవడం లేదు. 

Tuesday, May 5, 2015

పావుగంట వేసవి సెలవలు

  వేసవి సెలవలు రానే వచ్చాయి.  రుబ్బుడు యంత్రం లాంటి స్కూల్ ఆగలేక ఆగలేక ఆగింది. క్వారీ లోనో మిల్లు లోనో పని చేస్తున్నట్టు రోజూ మొఖాలు వేలేసుకుని వచ్చే పిల్లలు రాత్రి కూడా విశ్రాంతి లేక ఓవర్ టైం కార్మికుల్లా పని చేసే వారికి  సెలవలంటే ఎడారిలో వాన కురిసినట్టే, ఆకాశం లో ఇంద్రదనస్సు  అర చేతిలో వేలిసినట్టే.  పోలాకి లో ఉన్న పెదనాన్న  ఇంటికి వెళదామా ముంబైలో ఉన్న మేనమామ ఇంటికి వెళదామా అని అల్లోచన తెగలేదు ప్రణీత్ కి, సాయికి . పెదనాన్నని చూసి రండి. పోలాకి వెళితే పొలంలో ఆడుకోవచ్చు. అన్నాడు రాజారావు.

ప్రనీత్ కి తల్లి ఎంత చెప్తే అంత. సాయికి తండ్రి చెప్పినది బాగా నచ్చుతుంది.  పోలాకి చాలా చిన్న వూరు సాయీ , ముంబై అయితే పెద్ద సిటీ  అన్నీ చూడవచ్చు. రేపు ఎవరైనా ఎక్కడికి వెళ్లావు అని అడిగినా ముంబై అని చెప్పుకుంటే బాగుంటుంది అంది అమ్మ. నేను పల్లెటూరు వెళతాను. వేసవి సెలవల్లో ముంబై లో ఏదైనా కంప్యూటర్ కోర్సు లో చేరి .. పూర్తి చేయక ముందే , పోలాకి వెళతాను  పొలంలో ఆడుకుంటాను అన్నాడు సాయి. సరే అంది విశాల. రాజారావ్ పల్లెటూరి మనిషి  తెలుగు మీడియం లోనే చదివి సర్వీస్ కమిషన్ పాస్ అయ్యి ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి తృప్తిగా జీవిచాలనుకునే రకం. విశాల ని పెళ్లి చేసుకోక ముందు  జీవితం విసాలంగానే ఉండేది. చేసుకున్నాకే ఇరుకు అయిపొయిన్ది.

విసాలకి ఫ్యూచర్ ప్లానింగ్ ఎక్కువ. వర్తమానం కంటే భవిష్యత్తు లోనే  బ్రతుకుతుంది. భవిష్యత్ భయంతో బ్రతక కూడదే అని రాజారావ్  యెంత చెప్పినినా   టీచర్ ఉద్యోగం లో చేరింది. ఇంటికి వచ్చి కూడా ట్యూషన్లు చెప్పి డబ్బు సంపాదిస్తుంది విశాల. రాజారావ్ నోరెత్తి తే  భవిష్యత్ గురించి క్లాస్. భవిష్యత్తా ఎక్కడున్నావ్? అంటూ ఉంటాడు రాజారవ్.  ప్రనీత్ నేను ముంబై వెళతానమ్మా అన్నాడు. తను వెళ్ళేది తల్లి గురించే తనగురించి కాదు. సాయి మాత్రం  తన నిర్ణయం మార్చుకోలేదు. ఏదో ఒక కోర్స్ చేసి అందరికంటే నువ్వు ముందు ఉండాలి అంది విశాల ప్రనీత్ తో. సరే ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను

 అందరూ భోజనాలకి కూర్చున్నారు.  మనం ట్రైన్ లో వెళతామా బస్సు లో వెళతామా అన్నాడు ప్రనీత్. హ. హ్హ. హ్హ . ఒరేయ్ ముంబై ఎవడైనా బస్ లో వెళతాడా ? ట్రైన్ లో వెళ్ళాలి అన్నాడు సాయి నవ్వుతూ. అమ్మ వైపు చూసాడు ప్రణీత్. లేదు నాన్న మానం ఫ్లైట్ లో వెళదాము, అంది విశాల.  నాన్నా మనం కూడా ఫ్లైట్ లో వెళ్తామా? అన్నాడు. తల్లి , చిన్న కొడుకూ పగలబడి నవ్వారు. తండ్రి కూడా వారితో శృతి కలిపాడు. సాయి భాద పడడం గమనించి మనం వెళ్ళేది పోలాకి పల్లెటూరు కదా, శ్రీకాకుళం దాకా రైల్లో వెళ్లి అక్కడనుంచి బస్సు  లో వెళ్ళాలి.

సాయి కి కూడా విమానం లో ప్రయానించాలని ఉంది. మెల్లగా తన పట్టుదల నిర్ణయం సదలిపోయాయి. అమ్మ నేను కూడా ముంబై వెళతానమ్మా  అన్నాడు. పల్లె కి వెళ్లి ఆడు కోవాలనే చిన్న కలని చెదరగొట్టడానికి ఒక చిన్న అస్త్రం ప్రయోగించింది. ఆ రాత్రి  కలల్లో పొలాల్లో  ఆడుకుని ఉండేవాడు సాయి తల్లి విమాన ప్రయోగం చేయక పొతె. మదర్ ప్లాన్ ఆవిడ చేస్తే మాస్టర్ ప్లాన్ స్కూల్ వాళ్ళు చేసారు. భోజానాలు అయ్యి రాజారావ్ కంప్యూటర్ ఆన్ చేసి మెయిల్ చెక్ చేసుకున్నాడు. స్కూల్ నుంచి వేసవి సెలవలు తేదీలు మారినట్టుగా మెయిల్ వచ్చిన్ది. నాలుగు రోజులకి సెలవల్ని కుదించినట్టు మెయిల్. ఇంక వీళ్ళని   ఎం పంపుతాం? అన్నాడు విశాలతో రాజారావ్. మనం ఎం చేసినా , స్కూల్ వాళ్ళు ఎం చేసినా పిల్లల భవిష్యత్ కోసమే కదా? అంది విశాల. మీరేమీ ఫీల్ అవ్వక్కరలేదు, నేను వాళ్ళని ఎగ్సిబిషన్ కి తీసుకెళ్ళి అక్కడ చెప్తాను కదా. మై హుమ్నా అన్నట్టు చూసింది.  అయ్యో వెల్ల వేసవి సెలవలు పావుగంట లేవు , అన్నాడు రాజారావ్ నిట్టూర్చి. ఇవేమీ తెలియని పిల్లలు తియ్యని కలలలోకి జారు కున్నారు. 

Monday, May 4, 2015

అంధ విద్యార్ధి


ఆదర్శ కుటుంబం

విశ్వనాధం సూర్యుదయం చూసి చాలా కాలం అయ్యింది.   ఇంటినుంచి పని చేసి సంపాదించాలని డి టీ. పీ. కోరల్ డ్రా , ఫోటోషాప్ నేర్చుకున్నాడు. తెల్లవారక ముందే నాలుగు గంటలకి లేచి కంప్యూటర్ ఆన్ చేసాడంటే. మహాసముద్రం లో మునిగి పోతాడు. విశాఖపట్నం లో  బీచ్ దగ్గర ఉంటె సముద్రం లోంచి సూర్యోదయం చూడొచ్చని అందరూ అనుకుంటారు. కానీ ఆ అదృష్తం విశ్వనాధంకు లెదు.  సూర్యుడు సముద్రం లోంచి బయటకు వచ్చేటప్పటికే విశ్వనాధం పని అనే మహా సముద్రం లో మునిగిపోయి ఉంటాడు. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. దువ్వాడ అనే చిన్న గ్రామంలో ఏకోపాద్యాయ పాఠ శాలలో టీచర్. తనబదులు ఎవరినో పంపి నప్పేస్తుంటాడు. తప్పనిసరి అవినప్పుడు మాత్రం బడికి వెళ్లి వస్తుంటాడు. ఎక్కువ భాగం బిజీగా ఉంటాడు వడ్డీ వ్యాపారం చేస్తూ.

ఇంక కుటుంబం విషయానికి వస్తే

విశ్వనాదానికి ఇద్దరు పిల్లలు. కృష్ణ , కావ్య. కృష్ణ 10 లోకి వచ్చాడు. కావ్య 9 చదువుతున్నాది.   భార్య  కృష్ణ వేణి కూడా గవర్నమెంట్ ఉజ్జోగాస్తురాలే. ఉజ్జోగం తో పాటుగా  ఆమె కూడా టప్పర్ వేర్, సారీ రోలింగ్ బిజినెస్ చేసి డబ్బు సంపాదిస్తుంది. రాత్రీ పగలూ యంత్రాల్లా పనిచేస్తారు భార్య భర్త. రాత్రి పది అయ్యింది. వచ్చేపోయే కస్టమర్స్, ఎప్పుడూ మొగుతుందే సెల్ ఫోన్. అవును మరి  ఇల్లే దుకాణం.  పిల్లలకి చదువుకోడానికి ఒక రూం కేటాయించారు. అమ్మా ఆకలి అవుతోంది.

 తినీ మని చెప్పానా ? అంది కృష్ణ వేణి.
 అమ్మా ఆదివారం అందరం కలిసి తినోచ్చని చెప్పావు కదా. 
అబ్బా అమ్మని విసిగించకండి. టేబుల్ మీద పెట్టేసింది కదా తీసుకుని తినలేరా. నోటికి తినిపించాలా అంట చిన్న పిల్లలా ? అరిచాడు విశ్వనాధం. 

వచ్చే సంవత్సరం హాస్టల్ లో వేసేస్తాం. అన్నాడు  హాస్టలే నయం  అనిపించింది పిల్లలకి. పిల్లలు వాళ్ళ గదిలోకి పోయి తలుపు వేసుకున్నారు. విశ్వనాధం తన గదిలోకి వెళ్లి పోయి కంప్యూటర్ ముందు కూలబడ్డాడు.

 రాత్రి 11 అయ్యింది ..

భోజనాల టేబుల్ దగ్గర పిశాచాల్లా కూర్చున్నారు విశ్వనాధం కృష్ణవేణి. పిల్లలు తిన్నారా? అడిగింది, తినడం నువ్వు చూడలేదా? అడిగాడు విశ్వనాధం. నేను కొంచం బిజీ గా ఉన్నాను అండీ, నసిగింది కృష్ణవేణి . పెట్టుకుని తినే ఉంటారులే, తినమని చెప్పాను. వచ్చే సంవత్సరం హాస్టల్ లో వేసేద్దాం , అన్నాడు విశ్వనాధం. ఈ సంవత్సరమే వేసేద్దాం అంది కృష్ణవేణి.   ట్రిపుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ లో ఎవరి గదుల్లో వాళ్ళు పడుకున్నారు .  


విశ్వనాధం కృష్ణవేణి పెద్ద వాళ్ళు అయిపోయారు.  వారి కల నెరవేరింది. పిల్లలని అమెరికా పంపించేశారు ., ఆరోజు  కృష్ణవేణి కి  పిల్లలు గుర్తొచ్చి దిగులు చెందింది. పని మానేసి, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి దిగులుగా కూర్చుంది .కృష్ణవేణి మేన మామ వెదురుపాక సిద్దాంతి  వాళ్ళింటికి వచ్చాడు.    విశ్వనాధం కృష్ణవేణి దిగులు పడ్డం చూసి  అనున యించాడు  " మనం కష్ట బడేది  వాళ్ళ భవిష్యత్ కోసమే కదా. మా తోడల్లుడి కొడుకు కూతురు విదేశాల్లో వుజ్యోగాలు  చేస్తున్నారని ఎంత గొప్ప గా చెప్పుకున్తాడో.  మనం కూడా మన పిల్లలని అలాగే చెప్పుకోవచ్చు"  అన్నాడు విశ్వనాధం. ఆయన్ని అంతా ఎంతో మెచ్చుకున్నారు. వారిది ఆదర్శ కుటుంబం అని అందరూ వేయినోళ్ళ పొగిడారు అన్నాది కృష్ణవేణి. 


ఆయన అదంతా విని, అమ్మా పిల్లలని విదేశాలు పంపకపోతే వచ్చిన నష్టం లేదు, ఎవరితోనో పోటీపడి జీవించడం కంటే హీనం ఇంకొకటి లేదు.  అలాటి కుటుంబాలు పెరిగి పోతున్నాయి. ఒకడ్ని చూసి మరొకడు కిర్రెక్కి  పోతున్నాడు. ఇవి  ఆదర్శ  కుటుంబాలు కాదు., దౌర్భాగ్య కుటుంబాలు.  ఇలాంటి దౌర్భాగ్య కుటుంబాలు పెరిగి పోతున్నాయి.  నేను ఎవరూ లేక , భార్య చని పోయి బిడ్డలు లేక  ఏకాకి జీవితం గడుపుతున్నాను మీకు పిల్లలు  ఉండి  కూడా ఎకాకిజీవితాలు గడుపుతున్నారు,  అని చెప్పాడు.  కృష్ణవేణి కాఫి చేసి ఇచ్చింది 

దగ్గు ఆయాసం అని పెద్ద ఆసుపత్రి లో చూబించుకోమన్నారు  అందుకే  వచ్చాను. అన్నాడు ఆవిడ మేనమావ  విశ్వనాధం కృష్ణవేణి హాస్పటల్ చుట్టూ తిరిగారు. కానీ ఆయన వ్యాధి తగ్గలేదు. హాస్పటల్లోనే కన్ను మూసాడు. ఆయనకీ బ్రతకాలని లేదు. తనగురించి ఏ దిగులు పడలేదు. శవాన్ని ఇంటికి తీసుకొచ్చారు. అందరికీ కబుర్లు పంపారు. కొద్దిపాటి బంధుజనం మాత్రం వచ్చారు. అందులో విశ్వనాధం తోడల్లుడు వెంకట్రావ్ కూడా ఉన్నాడు. ఆరోజు రాత్రి కృష్ణవేణికి విశ్వనాథానికి పిల్లలు దగ్గర  ఉంటే  బాగుండును అనిపించింది. కృష్ణవేణి విశ్వనాథం ఎంతో బాధతో పడుకున్నారు.   


అంత్యక్రియలు పూర్తయిన తరువాత అందరూ కాలినడకన కారు వరకూ వస్తున్నారు. ఎవరు రాలేదు ఎందుకు రాలేదు అని చర్చించుకుంటున్నారు. " వర్ధనం మొగుడ్ని ఆసుపత్రిలో వేసారు, హార్ట్ అటేక్  అట , వర్ధనం ఎలావస్తుంది?  మన వరకు వచ్చేసరికి పిల్లలు కూడా వస్తారని ఆశ లేదు అన్నారు ఎవరో.  ఆ మాట వింటూనే విశ్వనాథం కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లడం పట్టండి  కారెక్కిద్దాం  అంది కృష్ణవేణి . బంధువులలో  ఒక డాక్టర్  విశ్వనాధాన్ని పరిశీలించి అబ్బే  లాభంలేదు  పోయాడు అని తేల్చేసాడు.  అబ్బా స్మశానం దగ్గరలో చచ్చిపోయాడు  ఎంత అదృష్టవంతుడో అన్నాడు ఒక బంధువు.   కృష్ణవేణి కి నెత్తిమీద సుత్తి దెబ్బలా అనిపించింది. ఆశుపత్రికి  కాకపోయినా ఇంటికి తీసుకెళదాం ! అవేం మాటలు అంది కృష్ణవేణి  


మీదంతా చాదస్తం లావున్నాది ఇంట్లో పెట్టుకుని ఎవరి కోసం ఎదురు చూడాలి  ఇక్కడికి తీసుకు రావలసిందే కదా  మీ పిల్లలు అమెరికాలో ఉన్నారు వాళ్ళెందుకొస్తారు ? ఇప్పుడంతా డబుతో లెక్క చూసుకుంటున్నారు  అన్నాడు వెంకట్రావ్ . బాగా  చెప్పారు. కృష్ణవేణి నువ్వు కూడా చచ్చిపోతే ఇద్దరినీ ఒకే సారి కాల్చేస్తాం. కట్టెలు కలిసొస్తాయి . అన్నాడు.  కృష్ణవేణి  కోపం పట్టలేక  ఎగిసి తన్నింది  విశ్వనాథం దబ్బున మంచమీదనుంచి పడ్డాడు. తెల్లారింది.   అంతా  అంత్యక్రియలకు బయలుదేరితే కృష్ణవేణి అమెరికా బయలుదేరింది.   


కోటీశ్వరులు

రెండు  కోట్లు విలువ చేసే పొలం ఉంది. పది లక్షలు అప్పు పుట్టక ఒక కోటీశ్వరుడు ఇబ్బంది పడుతున్నాడు అంటే దేన్నేమనాలి? అన్నాడు సర్వేస్వర్రావ్. విధి అంటే ఇదే అన్నాడు జోగారావ్. ఇప్పటికి ఈమాట చాలాసార్లు విన్నాను. ఇంతకీ ఎవరా కోటీశ్వరుడు? అన్నాడు పున్నారావ్. నేనే అన్నాడు సర్వేస్వరావు. నవ్వాగలేదు పున్నారావ్ కి.   పైత్యం అంటే ఇదే. అన్నాడు పున్నారావ్. పున్నారావ్ , కోటీశ్వరుడి కి  కూడా బ్యాడ్ పీరియడ్ వుంటుంది. కోటీశ్వరుడు,  కోటీశ్వరుడు, అని చెప్పుకుని తిరగడమే గానీ , ఏనాడైనా కోటీశ్వరుడి లా బ్రతికేవా? 


Sunday, April 12, 2015

గిఫ్ట్


"నాకు బైక్ కొనక పొతే కాలేజ్ కి వెళ్ళను." గట్టిగా తెగేసి చెప్పాడు. సురేష్. 

మా ఫ్రెండ్స్ అందరూ ఇంటర్ నుంచే బైక్స్ వాడు తున్నారు . నేను  బీ.టెక్  కి    వచ్చాను  ఇంటర్ లో కొంటాను అని చెప్పి ఇంకా కొనలేదు. "నేను చేసేది కండక్టర్ పని. నాకోచ్చే జీతం ..." అంటుండగా "నాకు ఎం చెప్పొద్దూ నాన్న"  అని ఆవేశంగా బైటకు వెళ్ళిపోయాడు.అతడు వెళ్లిపోతుండగా వచ్చాడు పక్కఇంటి ప్రసాదరావు .పలకరించినా ఆగకుండా వెళ్లి పోయాడు సురెశ్. "మంచి వేడి లో ఉన్నాడు వాడు ఎవరినీ చూసే స్థితిలో లేడు,  లోపలి రండి " అన్నాడు సురేష్ తండ్రి శంకరం. 

కొన్ని గంటల తరువాత వచ్చాడు సురేష్  వచ్చాడు సురెశ్. ఈలోగా బిడ్డ ఏమయిపోయాడోనని తల్లడిల్లి పోయింది తల్లి. సురేష్ కు కావలిసింది కూడా అదే. వస్తూనే ముఖం దుమ్మ లాడించాడు సురేష్. బిడ్డను చూస్తూనే బావురుమంది తల్లి. బాబూ ఎక్కడికి వెళ్లి పోయావురా? ఏమయిపోయావురా? ఎడుపు గొంతు తో అడిగుతున్న తల్లిని " ఏమీ అయిపోనులే, చచ్చిపోయాను అనుకున్నావా?" అంటూ ఈసడించాడు తల్లిని. 


బాబూ నీకు బైక్ ..అని ప్రసాదరావు కీస్ ఇచ్చాడు ఇంకా అతడు అక్కడే ఉండడం చూసి ఆశ్చర్య పోయాడు సురేష్. బండి తాళాలు ఇవ్వడం చూసి షాక్ అయ్యాడు.   అక్కడవున్న బైక్ చూసి ఇది " ఇది కొత్త బండి ప్రసాదరావు అంకుల్ కొడుకు మహేష్ ది కదా! ఇక్కడ ఎందుకు ఉంది?" అన్నాడు సురేష్. 

ఈరోజు నుంచి ఇది నీదేరా అన్నాడు శంకరం. ఇది మహేష్ ది   కదా నాది ఎలా అయ్యింది. నేను గోల చేసినప్పుడు రెండురోజులు నాకిచ్చి నన్ను ఊరుకోబెట్టడం కోసమా ఇదంతా .. ఇంతకుముందులా  చేయకు నాన్న నేను చిన్న పిల్లాన్ని కాదు. అన్నాడు సురేష్. 

ఈ బండి వద్దని చెప్పినా చేస్తానని కొనిపించుకున్నాడు నా కొడుకు మహేష్ . ఆ తరువాత అతి వేగంగా నడిపి తన మోజు తీర్చుకున్నాడు. కానీ  ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.  బండికి ఇంకాలేదు తాను మాత్రమే పోయాడు. ఇదిగో బాబూ తాళాలు తీసుకో మీ నాన్నను చంపకు. అన్నాడు ప్రసాదరావు .సురేష్ కి గుండె ఆగినంత పనైంది. తాను చేస్తున్న పని ఏంటో తెలిసొచ్చి  సిగ్గుతో తల దించుకున్నాడు 




గోడ

 రెండవ ప్రపంచ యుద్దానతరం ఈస్ట్ జర్మని రష్యా ఆధీనం లో  , వెస్ట్ జర్మనీ అమెరికా ఆధీనం లో ఉన్నాయి.  ఈస్ట్  జర్మనీ లో కమ్యునిస్ట్ పాలన వల్ల ప్రజలు  తీవ్ర అణిచివేతకు గురి అయ్యారు.

The Big Three—Soviet leader Joseph Stalin, British Prime Minister Winston Churchill  and U.S. President Harry Truman—met in Potsdam, Germany, from July 17 to August 2, 1945, to negotiate terms for the end of World War II and post war reconstruction on the European continent.  



ఇది ఆదిపత్య పోరు, వాటాలపంపకం కోసం జరిగిన మీటింగ్.  కానీ చరిత్రలో జర్మనీ పునర్నిర్మాణం కోసం జరిగిన సదస్సుగా చెప్తారు.


1948 తరువాత వెస్ట్ బెర్లిన్  కి USA నుండి  ఆర్థిక సహాయం వల్ల  వెస్ట్ లో జీవితం ఈస్ట్ వెస్ట్ జర్మనీ కంటే మెరుగ్గా ఉంది. జూన్ 1961 లో, కృశ్చెవ్ పాశ్చాత్య దళాలు తొలగించ కాపోతే    వెస్ట్ బెర్లిన్, ని దిగ్బంధం చేస్తానని    అధ్యక్షుడు జాన్ F. కెన్నెడీ ని  హెచ్చరించారు. కమ్యూనిస్టులు పశ్చిమ బెర్లిన్ కత్తిరించుకోవడం బదులుగా తూర్పు బెర్లిన్ కి  గోడ కట్టడం   వార్తను విన్న కెన్నెడీ ," ఇది ఒక మంచిపని పరిష్కారం కాదు  కానీ ఒక గోడ ఒక యుద్ధం కంటే మెరుగైనదే కదా అన్నారు"

1961 ఆగస్ట్ 13 న ఈస్ట్ జర్మనీ నుచి వెస్ట్ జర్మనీ లోకి తప్పించుకుని పోయే వారని నిరోధించడానికి బెర్లిన్ బోర్డర్ ని మూసివేసింది . బంధు మిత్రులను చూడడానికి , తమ వారిని కలుసు కోవడానికి ప్రాణాలకు తెగిన్చ్చి అనేకులు గోడ దాటడానికి ప్రయత్నించారు.  1000 మందికి పైగా ఈ గోడ దాటే ప్రయత్నంలో చనిపోయారు. 138 మంది కాల్చి వేయబడ్డారు. 

కానీ ఆంధ్రా తెలంగాణ మద్య కూడా గోడ కట్టబడింది. బెర్లిన్ వాల్ ని జర్మన్లు కట్టుకోలేదు  విదేశీయులు కటారు. గోడ కట్టబదినప్పటికి అక్కడ ప్రజల మద్య విబేధాలు లేవు. వారు ఒకరిని ఒకరు ద్వేశిచుకోలేదు. తామంతా ఒకే జాతి  అనే భావనలో ఉన్నారు.ఆంద్ర తెలంగాణాల మద్య కట్టబడిన గోడ బెల్రిన్ వాల్ లాగ భౌతిక మైనది కాదు. దీన్ని కట్టినది విదేశీయులు కాదు. మన రాజకీయ నాయకులచే ,ప్రజల మనస్సులో కట్టబడినది. ఆంధ్రావాళ్ళు దోపిడీ దారులు అనే భావనే ఈ గోడకు  పునాది గా నిలిచింది. ఆ గోడను  1990 లో కూల్చి వేసారు  కానీ ఆంద్ర తెలంగాణాల మద్య  గోడను ఎలా కూల్చగలం?

Tuesday, March 31, 2015

నిజమైన ప్రేరణ


  చాలామంది తల్లితండ్రులు బాగా పిల్లల మీద ఖర్చు పెట్టి వారిని ఏదో చేయాలని తపన పడతారు. కానీ చాలామంది పిల్లలు ఏమీ కారు ఎందుకు? పెట్టుబడి కంటే ప్రోత్సాహం ముఖ్యం , ప్రోత్సాహం కంటే ప్రేరణ ముఖ్యం. ప్రేరణ అంటే కేవలం బోధించడం కాదు. ఆచరించి చూపడం అసలైన ప్రేరణ. అసలైన ప్రేరణకు సిసలైన నిదర్సనం ఈ కధ

హేమ మాచెర్ల భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూర్ అనే గ్రామీణ గ్రామంలో జన్మించారు. ఆమె 25 చిన్న కథలు మరియు భారతీయ పత్రికలలో అనేక వ్యాసాలను ప్రచురించింది. ఆమె తన భర్తతో లండన్‌లో నివసిస్తుంది మరియు ఇద్దరు పెద్ద పిల్లలు ఉన్నారు.

చిన్నతనంలో, నా తల్లి రాయడానికి అర్ధరాత్రి నూనెను కాల్చడం చూసినప్పుడు నాకు రచనపై ప్రేమ మొదలైంది. నేను జన్మించిన భారతదేశంలోని ఒక చిన్న గ్రామమైన ఆత్మకూర్‌లో మాకు అప్పుడు విద్యుత్ లేదు. ఆమె ఇంటి పని పూర్తి చేసి, పిల్లలు మంచం మీద ఉన్నప్పుడు, నా తల్లి కిరోసిన్ దీపం వెలుగులో కూర్చుని రాసేది. ఆమె పుస్తకం ప్రచురించబడలేదు కానీ ఆమె ఉత్సాహం నాపై రుద్దుకుంది.

నేను పెద్దలు కుదిర్చిన వివాహం కోసం UKకి వచ్చినప్పుడు, నాకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు. లైబ్రరీ నుండి పిల్లల పుస్తకాలు చదవడం ద్వారా నేను నేర్చుకున్నాను. నేను భారతదేశంలో 25 చిన్న కథలను ప్రచురించినప్పటికీ, రెండవ భాషలో నా మొదటి నవల బ్రీజ్ ఫ్రమ్ ది రివర్ మంజీర ఒక పెద్ద సవాలు - కానీ నేను దానిని చేయాలని నిశ్చయించుకున్నాను. ఇప్పుడు నేను రెండవ నవల, బ్లూ ఐస్ రాశాను మరియు సంకలనాల కోసం రెండు చిన్న కథలు రాయడానికి నియమించబడ్డాను.

నేను రాయాలి. నా ఆలోచనలను కాగితంపై పెట్టలేకపోతే నాకు అశాంతి కలుగుతుంది. నా ప్రచురణకర్త లిన్ మిచెల్ నేను పుట్టుకతోనే కథ చెప్పేదాన్ని అని చెబుతారు. బహుశా ఆమె చెప్పేది నిజమే ఎందుకంటే నేను నా అమ్మమ్మ మరియు మా కుటుంబంలోని ఇతర పెద్దలు చెప్పిన కథలను ఆధారంగా చేసుకున్నాను.

బ్రీజ్ ఫ్రమ్ ది రివర్ మంజీర ప్రచురణ UK, USA మరియు భారతదేశంలో రేడియో మరియు టెలివిజన్‌లలో పఠనాలు, ప్రసంగాలు మరియు ఇంటర్వ్యూలతో నాకు పూర్తిగా కొత్త ప్రపంచాన్ని తెరిచింది. ఇంటి పనులు మరియు నా ముగ్గురు మనవరాళ్ల తరచుగా సందర్శనల మధ్య చిన్న ఖాళీలలో నా రచనను అమర్చుకోవడంతో జీవితం చాలా బిజీగా ఉంటుంది.

నిజం

ఎన్ని మాతృభాష దినోత్సవాలు చేసుకుంటే మాత్రం...
* ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ లో పాఠాలు తెలుగులో చెప్తారా?
* సైన్స్ జర్నల్ లో నా రిసెర్చ్ రిపోర్ట్ తెలుగులో రాస్తే పబ్లిష్ చేస్తారా?
* ఇస్రో వాళ్ళు రాకెట్ లో బటన్స్ తెలుగులో ఇండికేట్ చేస్తారా?
ఇంగినీరింగ్ , మెడిసిన్ తెలుగులో చదవగలమా?
ఒక వేళ ఎవరైనా కన్నడలో ఇంగినీరింగ్ చదివితే వాళ్ళ పరిస్థితి ఏమిటి ?
ఒక వేళ ఎవరైనా కొంకిణి భాష లో బయో టెక్నాలజీ లేదా ఫార్మకాలజీ  చదివితే వాళ్ళ పరిస్థితి ఏమిటి ?
 ఒక పైలెట్ ఏదేశం వెళ్ళినా వాళ్ళతో తెలుగులో సంభాషిస్తే అర్ధం అవుతుందా?
పెద్దోళ్ళు  వాళ్ళ పిల్లలు మనుమళ్ళు ఎవరైనా తెలుగు మీడియం లో చదువుతున్నారా...ఎందుకయ్యా మాకు తెలుగు... కూటిగా గుడ్డకా... కాస్తింత కూడుపెట్టేది ఆంగ్లమే...
మనవాళ్ళు ఇప్పుడిప్పుడే ఆంగ్లంలో పట్టుసాదించి మన తెలివితేటల్ని ప్రపంచ స్తాయికి తీసుకువేల్తున్నారు. అదే వాళ్లకి ఆంగ్లం రాకపోతే అలా సాద్యం అయ్యేదా. తెలుగు భాష గొప్పతనం చెప్పండి అంతే గాని ఇంగ్లీష్ వద్దు అని చెప్తే అంతకన్నా విడ్డూరం వుండదు. ఆంగ్లం లేనిదే అత్యున్నత అవకాశాలు వుండవు అని అందరికీ తెలుసు. కల్పనా చావ్లాకి ఆంగ్లం రాకపోతే స్పేస్ లోకి వేల్లగలిగేదా. ఇండియాలో ఏరో నాటికల్ ఇంజనీరింగ్ చదివే వాళ్లకి ఆమేకదా స్పూర్తి... పోనీ తెలుగు మాత్రమె నేర్చుకుంటే అటువంటి అవకాశాలు మన వాళ్లకి మీరు కల్పించగలరా చెప్పండి.... ఎదవ కబుర్లు చెప్పమంటే పెతోడు సేప్పెవోడే...


రతన్ టాటా చెప్పిన కధ

రతన్  టాటా గారు చెప్పిన కధ
" ఒక సారి మేము జెర్మనీ వెళ్ళాము . అది ధనిక దేశం . ఒక రోజు మేము ఒక హోటల్ కి వెళ్ళాము .
చాలా టేబుల్స్ ఖాళీగా ఉన్నాయి . ఆశర్యపోయాము అక్కడ అందరూ ఒకటో రెండో డిష్ లు తెప్పించుకుని పూర్తిగా తిని వెళ్తున్నారు . ఒక మూలాన టేబుల్ దగ్గర కొందరు వృద్ధులు ఒకే డిష్ తెప్పించుకుని అందరూ కలిసి పంచుకుని తింటున్నారు . ఇంత ధనిక దేశం లో ఇలా తింటున్నారేమిటి అనిపించింది మాకు మేము మా స్టేటస్ కి తగినట్టు రకరకాల డిషెస్ తెప్పించుకుని తిన్నాం. కొన్ని నచ్చలేదనో ఎక్కువయ్యయనో వదిలేశారు మా వాళ్ళు . తెప్పించుకున్న దాంట్లో మూడోవంతు వదిలేశారు మా వాళ్ళు  మేము లేచి వెళ్లి పోతుంటే అక్కడ ఉన్న ఒక వృద్ధ మహిళ మా దగ్గరకి వచ్చి అలా వేస్ట్ చెయ్యకూడదు అంది  మా ఫుడ్ . మా ఇష్టం అని మా వాళ్ళు కొంచెం రూడ్ గా మాట్లాడారు . అందుకు ఆ గ్రూప్ అందరికీ కోపం వచ్చింది . వెంటనే ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసింది .పోలీసులు వచ్చారు . జరిగినది విన్నారు. 50 యూరోలు ఫైన్ వేశారు మాకు . చెల్లించి వచ్చాము . వాళ్ళు అన్నది 
" డబ్బులు నీవి . కానీ ఇక్కడి రిసోర్స్ నీవి కావు . అందరివీ . ఇంకొకడు తినవలసినది నువ్వు పాడు చేశావు . ఆరకంగా నువ్వు ఈ దేశ సంపాదకు నష్టం చేకూర్చావు . దేశ సంపాదకు నష్టం చేసే హక్కు నీకు లేదు "
.మనం పెళ్ళిళ్ళలో ఎంత దుబారా చేస్తాం ? ఇది మనకు ఒక గుణ పాఠం కాదూ ?
.
"MONEY IS YOURS BUT RESOURCES BELONG TO THE SOCIETY.

Thursday, March 26, 2015

ఏక దిన్ కా హంగామా

ఉగాది వెళ్లిన మరుసటి రోజు నేను హాల్ లో సోఫా లో కూచుని పేపర్ చదువుకుంటున్నాను. టింగ్.  టింగ్ .. కాలింగ్ బెల్ మోగింది. పేపర్ పక్కన పడేసి తలుపు తీశాను. ఎవరో  తల్లి కూతురు లా ఉన్నారు. తల్లి చీర  కట్టుకుంది  పిల్ల పంజాబీ  డ్రెస్ వేసుకుంది " ఇకాడ , ఇలెఅయ్ మై నా వేకంట్ గా ఉన్నాయా ?" అర్ధం కాలేదు ఏం కావాలి? అన్నాను. అద్కాదండి. ఇకాడ ఐ మీన్ టూ లెట్ బొడ్ ఉంద్కడా? ఇల్లు ఏమైనా అదేకు దొర్కుతుందా?  అర్ధమయ్యింది ఈ  అమ్మాయి తెలుగుని  ఖూని చేసేస్తున్నాది. లోపాలాకి  రండి, "ఛి ఛి తన మాటలు నాకొచ్చేస్తున్నాయి  ఏంటి?"  అనుకున్నాను మనసులో . పక్క ఫ్లాట్ ఖాళి గా ఉంది మేము ఓనర్స్ కాదు. కానీ కీస్ మాదగ్గరే ఉన్నాయ్. కూచోండి. అన్నాను. ఇల్లు చూబించాను.

 చాలా బాగుందమ్మా, ఇది మా అమ్మాయి అంజలి పూర్తి పేరు దుర్గాంజలి. అంది తల్లి. అమ్మా ఏంటమ్మా ... ఏడుపుమొహం పెట్టింది అంజలి. అర్ధం కానట్టు చూసాను. అంతేనమ్మ, దుర్గ అనే పేరు చెప్పడం ఇష్టం ఉండదు. అంజలి అని చెప్పాలి,  అంది తల్లి  మమ్మీ  గట్టిగా అరిచింది  ఆ అమ్మాయి. కాదు కాదు అమ్మాయి పేరు  ఏంజెల్ . ఇంట్లో అలానే పిలుస్తాం.  అని సర్దుతుంది తల్లి కూతురు శాంతించింది.

 మరుసటి వారం ఏంజెల్ మా అపార్ట్ మెంట్  లోకి వచ్చేసింది. తండ్రి ఆర్  టీ  సి  లో కండక్టర్, పేరు మారుతి, ఏంజెల్ వాళ్ళ అమ్మగారి పేరు మాలతి. మారుతి, మాలతి ఎంతబాగా  నప్పాయో  అన్నాను.  మరుసటి రోజు అంజలి వచ్చింది " రేపు నా బాత్ డే , ఈవినింగ్ పాటీ కి తప్పక రావాలి" అంది. తెలుగు మాట్లాడే పద్ధతి కొంచం ఇబ్బందిగా ఉన్నా సద్దుకు పోవాలి అనుకున్నాను."అలాగే" అన్నాను. మరుసటి రోజు సాయం కాలం ఏంజెల్ ఉంటున్న పక్క ఫ్లాట్ కి  పార్టీ కి వెళ్ళాను.  పార్టీ కి చాలా మంది అమ్మాయిలు  వచ్చారు, 
ఏంజెల్ జీన్స్ వేసుకుని టీ షర్టు వేసుకుంది. మా అపార్ట్ మెంట్ లో అమ్మాయిలంతా ఇంచు మించు అలానే వచ్చారు. వాళ్ళంతా డాన్స్, సాంగ్స్ బాగా హడావిడి చేసారు. ఫోటోలు తీసుకుని ఫేస్బుక్ లో అప్లోడ్ చేసారు.  అంతా వెళ్లి పోయాక. కేక్ మీద పేరు లేదని కేండిల్స్ బాగోలోవని ఏంజెల్  తలిదండ్రులపై  యుద్ధం చేసింది    అలా అంజలి ఇంట్లో క్షమించాలి ఏంజెల్ ఇంట్లో  చాలా  పార్టీలు ,గెట్ టుగెదర్ లు జరిగేయి.   అదే ఇంగ్లిష్ప ద్ధతి. మాట, కట్టు, ఆట పాట. మా అపార్ట్మెంట్ అంతా ఇదే కల్చర్ అనే కంటే ఊరంతా ఇంచుమించుగా ఇదే కల్చర్. ఇలా చాలా కాలం  గడిచింది. నాకు ఇదంతా అలవాటయిపోయింది.

ఆ రోజు ఒక అద్భుతం చూసాను. అపార్ట్మెంట్ ముందు రంగు రంగుల ముగ్గులు. ఆ ముగ్గులని పువ్వులతో అలంకరిస్తూ 16 అణాల తెలుగు అమ్మాయిలా ఏంజెల్. నమ్మలేకపోయాను.  నిత్యం తలుపు లేసుకుని ఖైదీల్లా ఉండే మా అపార్ట్మెంట్ వాళ్ళు మామిడాకుల తోరణాలు కట్టి, మామిడి కాయలు, ఉగాది పచ్చడి గిన్నె, పళ్ళేలలో పెట్టి. తలుపులు బార్లా తెరిచి  కొత్తసంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు.  అంతా  అయోమయంగా ఉంది నాకు. 

పక్కకి తలతిప్పి చూడగానే కరెంట్  షాక్ తగిలినట్టయ్యింది పక్కనే టీ వీ కెమెరాతో  బృందం. 

మా అమ్మ వద్దన్నా లేచి ముగ్గులు వేస్తుంది రోజూ.  అంది అంజలి తల్లి.   అప్పుడు నాకు అంతకంటే  తట్టుకోలేని  దృశ్యం కనిపించింది. ఆ ఆస్కార్ నటన చూసి తట్టుకోలేకపోతున్నాను  అప్పుడు  నాకు 16 అణాల తెలుగు అమ్మయిల బృందం లంగా  ఓణీలలొ కనిపించింది.  వీ ళ్లెవరబ్బా ఎప్పుడూ చూడలేదే అనుకుంటున్నాను,  " ఉగాది శుభాకాంక్షలు" అంటూ  పంచె కట్టులో (నేనెప్పుడూ పంచె కట్టులో ఉంటాను)  ఉన్న నన్ను  అందరూ చుట్టుముట్టారు. వాళ్ళు అంతా మా అపార్ట్ మెంట్ అమ్మాయిలే. నిత్యం జీన్స్ వేసుకుని "ఎకాడ , ఏందుకు,  వాల్లు, వీల్లు," అంటూ తిరిగే వాళ్ళే.   అప్పుడు విడింది మబ్బు. ఈ రోజు టీ వీ ప్రోగ్రాం ఉంది. ఉగాది స్పెషల్.  టీ వీ ప్రోగ్రాం కోసం ఈ హడావిడి. వీళ్ళ కల్చర్, వీళ్ళ సంప్రదాయాలు..  ఏక దిన్ క సుల్తాన్ కథ గుర్తొచ్చింది.  

Wednesday, March 25, 2015

రేపే విడుదల

చిన్న పిల్లలు బారులు తీరి ఇటుకలు తలపై పెట్టుకుని నడుస్తున్నారు. పైన ఎండా మంది పోతోంది. వారి చినారి పాదాలు కమిలి పోతున్నాయి. ఆ లైన్ లోనే ఒక చివర నుంచి మరో చివరికి వచ్చే టప్పటికి ఒకొక్క పొరగా వారి బాల్యం ఊది కింద పడుతోంది, వాళ్ళు పెద్ద వాళ్ళుగా ఎదిగి నూగు మీసాలు గడ్డాలతో కనిపిస్తున్నారు. పక్కనే వాళ్ళ తల్లి తండ్రులు ఉన్నా నివారించే  ప్రయత్నం చేయడం లేదు. ఒక పిల్ల గుక్కెడు నీళ్ళ కోసం అలమటిస్తున్నాది, ఓ పిల్లవాడు ఒక్క సారి బరువు దింపు కుంటాను  అని చిన్న విరామం కోసం వేడుకుంటున్నాడు, " నువ్వు పెద్ద వాడివి అయ్యిన తరువాత అంతా నీడే,  నీడ లో కావలిసినంత  విశ్రాంతి తీసుకోవచ్చు" అన్నాడు ఒక తండ్రి. " చూడమ్మా నువ్వు త్వరగా  నడవక పొతే వెనక పడిపోతావు. చూడు, అందరూ ఎలా  ముందుకు వెళ్లి పోతున్నారో!" అందొక తల్లి. చుట్టూ చూడ కుండా కళ్ళకు గంతలు కట్టేశారు. గుడ్డి పరుగు ప్రారంభ మయ్యింది. ఆ పరుగు లో కొంతమంది నేలకొరు గుతున్నారు. అసువులు బాసినివారిని లాగి పారేస్తున్నారు కాపలా దారులు.

పరుగు మాత్ర ఆగలేదు. పసి పాదాలు నెత్తురోడు తున్నాయి. ఆపండి అని అరిచి  ఉలిక్కి పది లేచాడు ప్రకాశరావు. రాజేశ్వరి వెంటనే లేచి లైట్ వేసింది. ఎంటండి ? ఏమయ్యింది ? కంగారుగా అడిగింది. ప్రకాశరావు తనకొచ్చిన కల గురించి చెప్పాడు. కొంచెం మంచి నీళ్ళు తాగండి అని మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది రాజేశ్వరి.

పాడు కల. అయినా కల వస్తేనే ఇంత కంగారు పడాలా అంది రాజేశ్వరి. కల కాదె నిజమే. ఇప్పుడు చదువులు షోకు .. నీకు ఇలా చెప్తే అర్ధం కాదు గానీ, నిన్న నాని గాడికి కొన్న బొమ్మ చేతిగడియారం ఇలా పట్రా. అబ్బ .. అంటూ విస్కుక్కున్తూనే తెచ్చి ఇచ్చింది రాజెస్వరి. "ఇది చూసి టైం చెప్పగలవా?" అన్నాడు ప్రకాశరావు  " ఇది చూసి ఎలా చెప్తాం ? ఇది షోకు కోసమే, పనికి కాదు." అలాగే అయిపోయాయి  నేటి  చదువులు. పక్కింటి ప్రతాప్ ని చూడు పీ. జీ  చేసి ఇంగ్లీషులో ఒక్క ముక్క చదవలేదు రాయలేదు. ఎదురింటి అబ్బాయి ది బి టెక్ అయ్యిందన్న మాటే గానీ ఎ వుద్యోగం లేకుడా నాలుగేళ్ల  నుంచి  ఖాళీ గా తిరుగుతున్నాడు.

 ఏ జ్ఞానం ఆశించి ఈ చదువులు చదువులు చదివిస్తున్నారు? చాల్లెండి జ్ఞానం కోసం ఎవరూ చదువుకుంటున్నారు? కొలువుల కోసం చదువుకుంటున్నారు గానీ. అయినా మన చిన్నా గాదు ఆ లైఇన్ లో లేదు కదా మీ కెందుకు బాధ. మన చిన్న  ఉన్నది కూడా  కార్పరేటు స్కూల్ లలోనే కదే! ఇంకా ఏమీ అర్ధం కావడం లేదా?! ఆదివారం క్లాసులు, అర్ధరాత్రి దాకా చదువులు. మార్కులే తప్ప వెధవకి మన పనిమనిషి పైడి తల్లికి ఉన్న లోకజ్ఞానం లేదు.



 నిజ మే శాటిలైట్ నుంచి భూమి స్పష్టం గా కనిపించినట్టు ఫారినర్స్ కి మన జీవితాలు కనిపిస్తున్నావు. లోపల కూరుకుపోయి ఉండడం వాళ్ళ మనకి కనిపించడం లేదు. రేపే చిన్నా గాడి విడుదల. అన్నాడు ప్రకాశరావు ఆనందంగా.



వారసులు


ఆత్మాభిమానం ఉన్న వాడెవడూ క్లాస్స్ లో నిలబడడు. అయినా మేము ఇంటర్మీడియట్ లోకి వచ్చినా     టెన్త్ క్లాస్స్ పిల్లల మాదిరిగానే మమ్మల్ని చూస్తే ఎలా?  కాస్త ఆవేశంగా అడిగాడు హరీష్. లెక్చరర్ నిన్ను హోం వర్క్ చేయలేదని బయటకు వెల్లిపొమన్నారు అంతేనా? బయటకు వేల్లిపోమనలేదు సార్ క్లాస్ లో నిలబడమన్నాడు. ఈ సంభాషణ ఒక ప్రైవేట్ కాలేజీ లో ప్రిన్సిపాల్ రూం లో జరుగుతొన్ది.  ప్రిన్సిపాల్ రాజారాం కొత్తగా వచ్చాడు ఆ కాలేజికి. కస్టమర్స్ లా ప్రవర్తిస్తారు అ కాలేజీ విద్యార్ధులు అని విన్నాడు రాజారాం. దానికి కారణం కాలేజీ యాజమాన్యం కూడా. తప్పుంతా విద్యార్థుల మీద నెట్టడానికి కూడా లెదు. విద్యార్ధులను ఎడ్యుకేట్ చేయడం మినహా వేరే మార్గం లేదు అని జేరే టప్పుడె నిర్ణయించుకున్నాడు. "కర్ర విరగ కూడదు పాము చావకూడదు. అదీ పరిస్థితి. ఆవిషయం నేను చూసుకుంటాను గానీ ... నువ్వు రెండు రోజులు ఇంగ్లిష్ క్లాస్స్ కి వెళ్ళకు. " సార్ అంటే ర్న్డురోజుల తరువాత ."  హరీష్ ఏదో చెప్పబోయాడు. " ఇంకేమీ మాట్లాడకు నేను చెపుతున్నాను కదా !" అన్నాడు రాజారాం. " ఓ కె సార్" అంటూ సంతోషంగా వెళ్ళిపోయాడు హరీష్. రాజారాం లేవబోతుండగా ఇంగ్లిష్ లెక్చరర్ జీవన్ వచ్చారు.

గుడీవినింగ్ సర్. " జరిగిన విషయం ఏంటంటే ..." మొదలెట్టా బోయాడు. " అంతా తెలుసు రెండురోజుల తరువాత మీ క్లాస్ కి వెళ్ళమన్నాను."  "కానీ హరీష్ ప్రవర్తన .." అన్నాడు జీవన్. అదీ చూద్దాం. మీరే చూస్తారు గా క్లాస్స్ కి వస్తాడు గా, అంటూ లేచి ఏదో పని  ఉన్నట్టు వెళ్ళిపోయాడు రాజారాం.

 ఏంటో అంతా అయోమయంగా ఉంది. విద్యార్ధిని ఏమీ అనకుండా సర్ది చెప్పి పంపించేసాడు  ఇప్పుడు నన్ను సర్ది చెప్పి పంపించేస్తున్నాడు. అంకుంటూ వెళ్ళిపోయాడు. రెండురోజుల తర్వాత హర్ష క్లాస్ లో కనిపించాడు. ముందు బెంచిలో కూర్చున్నాడు. " హొమ్ వర్క్ చేసు కొచ్చాను, సార్, అ యాం సారీ సార్. ఐ విల్ నాట్ రిపీట్ ద మిస్టేక్ అగైన్. ఐ ప్రామిస్. అన్నాడు. " ఇట్స్ ఆల్ రైట్  మేన్, చీర్ అప్ " అని హరీష్ ని తట్టి అభినందించాడు.

క్లాస్ బైటకోచ్చిన తరువాత మరింత అయోమయం లో పడ్డాడు జీవన్. ఎం చేసి ఈ కుర్రాడిని ఇంట మంచిగా మార్చేశాడు. ఇంత త్వరగా ఎలా మార్చేడు!  టీ తాగితే గాని బుర్ర పనిచేయదు. అనుకుంటూ కేంటీన్ లోకి నడిచాడు. అదృష్ట వశాత్తూ కాలేజీ గూగుల్ గా పేరు పడ్డ తెలుగు లెక్చరర్  సర్వేశ్వరరావు కనిపించాడు. ఆయనకు తెలియని విషయం ఉండదని విన్నాడు. " నమస్తే, రండి టీ తాగుదాం." అంటూ ఆహ్వానించాడు. టీ తాగుతున్నారు ఇద్దరూ  అడగకముందే అందుకున్నాడు సర్వేశ్వరరావు.  ఎతా వాతా తేలింది ఏంటంటే. రాజారాం హరీష్ ఫేస్ బుక్ పోస్ట్ ల నుంచి అతన్ని పూర్తిగా స్టడీ చేసి, హరీష్ ఫ్రండ్స్ తో ఒక షార్ట్ ఫిలిం  షూట్ చేయించి  వాళ్ళ చేతే హరీష్ కి లింక్ పంపించి, కామెంట్స్  కూడా పోస్ట్ చేయ మన్నాడు. అంతే కీలెరిగి వాత పెట్టడం అంటే ఇదే. అంటే హరీష్ మారి పోయాడు.

కంప్యుటర్ ఆన్ చేసి యూతుబ్ లో  వీడియో యూ ట్యూబ్ లో వీడియో చూస్తున్నాడు జీవన్

ఆ ఫిలిం పేరు మిస్టర్ మిసండర్ స్టాండ్. అ ఫిలిం మొత్తం  మిస్టర్ మిసండర్ స్టాండ్. అనే ఒక మొద్దవ తారం గురించి. మిస్టర్ మిసండర్ స్టాండ్ రోల్ శివ నటించాడు. శివ అన్నిటిని అజ్ఞానం తో అన్నిటినీ  అపార్ధం చేసుకుంటూ ఉంటాడు. అంతా బాగా కామెడీ చూబించినా, అందుమూలంగా  జీవితం లో అన్నో విలువైన వాటిని కోల్పోతుంటాడు శివ. శివ చేస్తున్నది హరీష్ నిజజేవితం లో ఘటనలుతో హరీష్ రోల్ చేస్తున్నాడు.
ధర్యం అంటే? అడిగాడు శ్రవణ్.
స్టంట్ బైకింగ్ రా. అదే ధైర్యానికి అడ్రస్. అన్నాడు శివ.
రేష్ గా ఉండడమే ధైర్యం అనుకుంటున్నావు నువ్వు. ధైర్యం ఉన్నవాళ్ళు గట్టి నిర్ణయాలు తీసుకుని ఎన్ని కస్టాలు ఎదురొచ్చినా వాటిని అమలు చేస్తారు. అంటే గానీ మూవింగ్ బస్ నుంచి దిగి చెయ్య విరగ్గోట్టుకోరు. హరీష్ కి ఇదే జరిగింది, చెయ్య విరగలేదు గాని గట్టి దెబ్బలు తగిలాయి. ఆత్మాభిమానం గురించి చర్చ వస్తుంది అమ్మాయి ప్రేమించకపోతే తగిన  గుణ పాఠం చెప్పాలి అంటాడు శివ. అదే ఆత్మాభిమానం ఉన్నవాడు చేసేది. ఇంకా నయం కాలేజీలో లెక్చరర్ తో గొడవ పెట్టుకోవడం కూడా ఆత్మాభిమానమే అంటావు.  నీ అంత కఫ్యూజన్ కాండిడేట్ ని నేను ఎక్కడా చూడలేదు.  ఫేస్ బుక్ లో అలాంటి  హీరో బొమ్మతో అకౌంట్ నడుపుతారు కొందరు.  తన బొమ్మ పెట్టుకోలేనివాడికి సెల్ఫ్ రస్పెక్ట్ గురించి చెప్పినా అర్ధం కాదు. అంటాడు శ్రవణ్.  మూవీ లో శివ ఫేస్ బుక్ అక్కౌంట్ ఒక సినిమా హీరో బొమ్మ తో నడుపుతూ ఉంటాడు. నిజ జీవితం లో హరీష్ చేసే పని కూడా అదె.  తరువాత శివకి ఒక యూట్యూబ్ వీడియో చూబిస్తాడు శ్రవణ్.

నేతాజీ కుమార్తె అనిత బోస్ ను Augsburg Germany లో ఇంటర్వ్యూ చేసిన విడియో అది. "మీ నాన్న గారు గొప్ప వ్యక్తి  కానీ  అది  నిన్ను  గొప్ప వ్యక్తి గా ఎన్నటికీ  చేయదు." అని తల్లి చెప్పినట్టుగా అంటారు ఆమె . స్వశక్తి తో పైకి రావాలి అనే విషయం ఆమె లో బలంగా నాటుకుంది భారత దేశం వచ్చి బెంగళూరు లో స్థిర పడవలసిన్డిగా అడిగారు. వచ్చి ఉంటె రాజకీయాల్లో కి వచ్చేవారా అని అడిగితే " ఒకరి కూతురిగా బతకడం నాకు ఇష్టంలేదు అన్నారు" వ్యక్తిత్వానికి చిరునామా అనిత. ఇప్పటి హీరోలు తండ్రి తాత ముత్తాతల పేర్లు మీద నెట్టుకొస్తున్నారు. అలాటి వారిని ఆరాధించే వాళ్ళను ఏమనాలి ?  

Tuesday, March 24, 2015

సినిమా హీరో - చెట్టు

సుధాకర్ కొత్తగా సినీ రంగం లో అడుగుపెట్టేడు. చేసినవి రెండే సినిమాలు కానీ మంచిపేరు తెచ్చి పెట్టాయి. కోటి ఆశలతో రంగుల ప్రపంచం లో విహరిస్తూ తనుండే చిన్న పల్లె నుండి హైదరాబాద్ వచ్చేసాడు. పెట్టె బ్యాగు తప్ప ఏమీ లేవు. ఊరవతల ఉన్న కాలనీలో చిన్న ఇల్లు తీసుకున్నాడు. మొదట్లో అవకాశాలకోసం కాళ్ళరిగేలా తిరుగుతూ హోటల్ లో భోజనం చేసే వాడు. తర్వాత అనిపించింది, ఆరోగ్యం  పాదవుతోందని. ఖాళీ ఉన్నప్పుడు వండుకోడమే మంచిదనిపిచింది. అలా వండుకుంటూ తోముకుంటూ ఉండే  రోజుల్లో పెరట్లో  ఒక మామిడి మొక్క నాటాడు. రోజూ ఏంటో అపురూపంగా అనిపించేది మొక్క ఎదుగుతుంటే. నేను చిత్ర పరిశ్రమ లో నీలాగే ఎదగాలి అని కోరుకుంటూ ఉండేవాడు. దేవుడు కరుణించి పిచ్చి డైరెట్రు రాజ గోపాల వర్మ కంట్లో పడ్డాడు. సుడితిరిగింది సుధాకర్ కి. అంచలంచెలుగా ఎదగడం ప్రారంభించాడు. మొక్క తో మాట్లాడడానికి తీరిక లేక  పోయింది. ఒకరోజు సుధాకర్ సిటీ లోకి మకాం మార్చాలని నిర్ణయించుకున్నాడు. తప్పదు మరి. తన ఇమేజ్ కు తగ్గట్టుగా ఒక ఇల్లు ఒక ప్రొడక్షన్ మేనేజర్ చూసాడు. సుధాకర్ కి నచ్చిన్ది. వెళ్ళే ముందు మామిడి మొక్క దగ్గరికి వెళ్ళాడు. చెయ్యి ఎత్తి చిటారు కొమ్మ ని అందుకున్నాడు. కొద్ది నెలల్లో నాకు అందకుండా పోతావు. కానీ నువ్వు వచ్చిన వేల చాలా మంచిది. నాకు మంచి  అవకాశాలు వచ్చాయి. ఈ ఇంట్లో ఉండే ఇద్దరు ప్రాణులమ్ మనం. ఇంతకాలం కలిసి ఉన్నాము. సెలవ్, తీరికున్నప్పుడు వచ్చి చూస్తాను.   సుధాకర్ దశ తిరిగింది. పెద్ద హీరో అయిపోయాడు. నగరం లో ఆస్తులు బాగా సంపాదించాడు. బాగా మారిపొయాదు.  తన తోటి హీరోలని అణగ దొక్కి, హీరోయిన్లని దౌర్జన్యంగా గుప్పిట్లో పెట్టుకొని, ఎదుగుతున్నాడు. సుధాకర్ కి  పెళ్లి కుదిరింది. పెద్ద హీరో అనే అహం చల్లార్చుకోడం కోసం  విపరీతంగా కట్నం తీసుకున్నాడు.  కళ్యాణ మండపం కి తన పాత ఇంటి దగ్గర  ఉంది. పెళ్లి అయిపోయిన తరువాత  కార్ లో మళ్ళీ సిటీ లో ఉండే ఇంటికి వెళ్ళుతుండగా " డ్రైవర్, కార్ ఆపు" అన్నాడు  భార్యతో సహా కార్ దిగాడు. తన స్నేహితున్ని పరిచయం చేసాడు. అనేక మంది ఆ చెట్టు నీడలో సేద తీరు తున్నారు. కొంత మంది పిల్లలు మామిడి కాయలు కోసుకొని తింటున్నారు. సుధాకర్ చెట్టు పైకి చూసాడు. కొమ్మలలో అనేక పక్షులు. ఒక పక్షిని చూస్తుండగా తన చేతి నుండి  జారి పోయిన పిట్ట, (హీరొయిన్) గుర్థొచ్చిన్ది. ఆమెకు అవకాశాలు రాకుండా చూడడానికి ఒక గ్రూప్ నిరంతరం కాపలా కాస్తోంది. ఎందుకో సిగ్గేసింది. ఎంతో మంది కార్మికుల రక్తాన్ని , రచయితల మేధా శక్తిని, సాంకేతిక నిపుణుల నైపుణ్యాన్ని పిండుకుని, అట్ట సెట్టింగుల తో అద్దెకు తెచ్చుకున్న ఆడవారితో,  మరొకరి ప్రతిభను తన ప్రతిభ గా చూబించుకునే తనెక్కడ , భూమాత తనకి ఇచ్చిన శక్తిని వేర్లద్వారా గ్రహించి అనేక మందికి నీడనిచ్చే చెట్టు ఎక్కడ?  ఇలా ఆలోచిస్తుండగానే చెట్టు మీద నుంచి ఒక పండు పడింది. ఎంత అదృష్టం నువ్వు తెలిసిన వాళ్ళు  తెలియని వాళ్ళు అన్న బేధం లేకుండా అందరికీ నీ ఫలాలు పంచుతున్నావు. చల్లిని నీడని ఇస్తున్నావు. నేను తెలిసిన వారిని కూడా  దోచు కుంటున్నాను. ఎంత తేడా? నువ్వు ఎదిగి వృక్షం అయ్యావు.  నేను ఇంకా ఎదిగితే రాజకీయ నాయకుడు అవుతాను. నేవు అనేక మందికి నిత్యం నీడ నిస్తున్నావు, నీడలేకుండా చేస్తున్నాను నేను. నువ్వు అనేక మందికి ఫలాలని పంచుతున్నావు నేను మురికిని పంచుతున్నాను . నువ్వే నాకు స్ఫూర్తి. నా చేతులతో నేనే నిన్ను నాటాను. ఇకపై  మంచి చేస్తాను సమాజానికి. సెలవ్ మిత్రమా!

హిపోక్రసీ

మాతృభాషకు సేవ చేయాలనీ , మాతృమూర్తి గొప్పతనాన్ని , మాత్రు భాష ప్రాశస్త్యాన్ని నరాలు తెగ్గొట్టుకుని మాట్లాడేడు వేణుగోపాల్. అతడిని స్టేజ్ దిమ్పేసరికి  తాతలు దిగోచ్చేరు. ఎట్టకేలకు వేణుగోపాల్ స్టేజ్ దిగాడు ముత్యాలరావ్ మెల్లగా మైక్ అందుకున్నాడు. అతడిని చూసి మైక్ విరిచేస్తాదేమో అనుకున్నారు అంతా. అలా ఎం జరగలేదు. కూల్ గా రెండు మాటలు మాట్లాడేడు, ప్రాగ్మేటిక్ పీపుల్ - కసిగా అన్నాడు అన్నాజీ. అంటే ఏంట్రా అన్నాడు నానాజీ ? చాలా ప్రాక్టికల్ గా ఉండేవాళ్ళని  ప్రాగ్మేటిక్ అంటారు. ఇందాక స్టేజ్ మీద మాట్లాడిన వేణుగోపాల్ గురించేనా? కాదు ఇప్పుడు మాట్లాడుతున్న ముత్యాలరావు గురించి. మాత్రు భాష ని గౌరవించండి సాద్యమైనంత వరకూ , ఆదరించండి వీలుంటే,  నేను మాతృభాష కి  అవకాశం లేక ఏమీ  చేయలేదు. అంటూ తన ఉపన్యాసం ముగించాడు. అన్నాజీ కి అది చాలా తప్పుగా కనిపించింది. నానాజీ కి నవ్వు వచ్చింది. ప్రాగ్మేటిక్ గా అంటే ప్రాక్టికల్ గా ఉండడం లో తప్పు లేదు. కానీ హిపోక్రాటిక్ గా ఉండడం తప్పు, చాలా తప్పు. హిపోక్రసీ అంటే నటన.  ఉదాహరణకు వేణుగోపాల్ ఇచ్చిన ప్రసంగం ఇచ్చిన బాగుంది కానీ అతడు మాతృభాషకు అతడు  ఏమీ చయ్య లేదు.  "అంటే? అన్నాడు అన్నాజీ. నానాజీ చెప్పడం ప్రారంభించాడు.
మాత్రు భాష ని గౌరవించండి, ఆదరించండి అని అడగవద్దు. అది జరగదు, ఎవరూ గౌరవించం అని అనలేరు అలాగే అని నవ్వుతూ పిల్లలని చల్లగా ఇంగ్లిష్ మీడియం లో చదివించుకుంటారునీలా. ఫిలాసఫీ చదువుకునే విద్యార్థుల సంఖ్య టెక్నాలజీ చదువు కునే విద్యార్థుల సంఖ్య లో 2% కూడా ఉండదు. ఫిలాసఫీ చాలా గొప్పదే కావచ్చు. కానీ పనికొచ్చే టెక్నాలజీ చదువుకుంటారు ఎక్కువ మంది. అలా అని ఫిలాసఫీ ని చెడ్డది అని అనరు. మాత్రు భాష కూడా అంతే. మాత్రు భాష ని గౌరవించండి, ఆదరించండి అని అడగి వారిని ఇరకాటంలో పెట్టవద్దు. మాత్రు భాషని గౌరవించండి వంటి నీతి చెప్పేటప్పుడు, మీరు ఏమి చదువుకున్నారు , మీ పిల్లలు ఏమి చదువుకున్నారు ( ఏ భాషలో ). అనేది చెప్పి అప్పుడు ఏ రకంగా ఇతరులు గౌర విన్చాలో తెలియజేయండి. ఆచరించి చూపి ప్రభావితం చేయండి. 

నిరక్షర కుక్షిలు

బొత్తిగా ఆలోచనా జ్ఞానం లేక అజ్ఞానం లో మగ్గి పోయే వాళ్ళను Nincompoops (నిన్కంపూప్స్) అంటారు. జపాన్, రష్యా, అమెరిక నుంచి స్త్రీలు పురుషులు భారత దేశం వచ్చినప్పుడు మన చీరలు పంచలు ధరించవచ్చు.మన దుస్తులు ధరించి మన సంస్కృతీ ,సంప్రదాయాలను గౌరవిస్తున్నారు. అది చూసి వాళ్ళ కల్చర్ కంటే మనకల్చర్ గొప్పది అని ఒక అభూతకల్పనను సృష్టించడం ఆలోచనా జ్ఞానం లేని వాళ్ళు , నాసిరకం మనుషులు చేసే పని. విదేశీయులు వాళ్ళ దేశం తెరిగి వెళ్లి , వాళ్ళ దేశం లో మన వస్త్రాలు ధరించరు. కానీ మనం మాత్రం మన జీవితకాలం విదేశీ వస్త్రాలతోనే జీవిస్తాం


మన బట్టలు కట్టుకోడం మొదలు పెడితే మన కల్చర్ కు అంకురార్పణ జరుగుతుంది. మనం వారిని మన కంటే అధికులు గానే చూస్తాము మన కల్చర్ని తక్కువగా చూస్తాము. మన కంటే గొప్పవారు అని భావిస్తాం కనుకనే వారి బట్టలు ధరించగలము. స్త్రీలు పురుషల బట్టలు ధరించగలరు. కానీ పురుషులు స్త్రీల బట్టలు ధరించలేరు, ఎందుకు? 

Monday, March 23, 2015

తేడా ఏముంది?


ఉదయాన్నే ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు కొట్టుకుంటున్నారు కాలేజీ ప్రెమిసెస్ లో  చుట్టూ చాలా మంది పోగయ్యారు. ఒరేయ్ ఫణి ఎందుకురా కొట్లాట? అరిచాడు మస్తాన్.  ఎవరో ఒక చిత్ర కారుడు సరస్వతి దేవి చిత్రాన్ని నగ్నంగా వేసాడు.అది చూసి బాగుంది అని చప్పట్లు కొట్టాను అందుకే వివేక్ నన్ను కొట్టాడు అన్నాడు ఫణి. క్లాస్స్ అంతా  గుమ్మి గూడింది. వద్దని వారిస్తున్నా వాళ్ళు కొట్టుకోడ ఆపలెదు. ఒరేయ్ బొమ్మ బాగుంది ఎంజాయ్ చేస్తున్నాను ఇందులో తప్పేముంది రా ? అన్నాడు ఫణి."


తప్పా తప్పున్నరా? సరస్వతిని అవమానిస్తుంటే ... బుర్రలేదురా?" అన్నాడు ఒకడు. "వాడికి వివేకంముంది కాబట్టే కొట్టేడు." అన్నాడు ఇంకొకడు. "జ్ఞాన స్వరూపిణి గా భావించి చదువుల తల్లి గా కొలిచే సరస్వతి ని అవమానిస్తే  చూసి ఆనందిస్తున్నావా ? మనిషి వా పశువ్వా?"అన్నాడు అర్జున్ . "ఒరేయ్ అర్జున్ నవ్వెనా, నా క్లోస్ ఫ్రెండే నా ఇలా మాట్లాడేది!!" అన్నాడు ఫణి. "మాట్లాడడమే కాదురా తంతాను కూడా" గట్టిగా కర్ర విరిచేశాడు అర్జున్. "మీ అందరిదీ అదే మాటా?" అన్నాడు ఫణి అందరి వైపూ చూస్తూ. "ఆ అంతే, మామాట కూడా అదేమాట." సరస్వతిని అవమానిస్తే తన్నొచ్చన్న మాట. అని కామ్ గా జేబులో చేయి పెట్టి మొబైల్ తీసాడు. ఏంచేస్తున్నాడో ఎవరికీ  అర్ధం కాలేదు. అయితే ఇది చూడండిరా అని ఒక వీడియో ప్లే చేసాడు. పాట కు యువత చిందులు వేస్తున్నారు. ఆ చూస్తున్నావారే ఆ చిందులు వేసే వారు. ఆ పాట

హిస్టరీ లెక్చరున్ది , మిస్టరీ పిక్చరున్ది రెంటిలో ఏది బెస్ట్ రా?
బోటనీ పాఠమున్ది మేటనీ ఆట ఉంది రెంటిలో ఏది బెస్ట్ రా?
హిస్టరీ రొస్టు కంటే రెస్టు మేలు, బోటనీ పాఠ మంటే బోరు బోరు

"నిన్న మీరు ఈ పాటకే కదా చిన్దులేసారు. ఇది తప్పు కాదా?"స్వరం పెంచాడు ఫణి.  అది పాటే కదా అన్నాడు ఒకడు. ఇది బొమ్మే కదా అన్నాడు ఫణి 

అప్పుడే ప్రిన్సిపాల్ గారు వచ్చారు "సరస్వతి దేవిని చదువుకునే విద్యార్ధులే అవమానించడమా !!
హుస్సేన్ సరస్వతి దేవి ని చిత్రినిన తీరుకి ఇది ఏమీ భిన్నం గా లేదు. సినిమా పిచ్చిలో ఎంటర్ టైన్మెంట్ మోజులో ఇలాటి పాటలని ఆనందించ కూడదు."అన్నారు 

కోట


అది ఒక పెద్ద కోట. సుందర నిర్మాణము. సువిశాలమైన  ఆ కోట కు చాలా ఘనమైన చరిత్ర ఉంది. అనేక దేవతా మూర్తుల శిల్పాలు, కళలతో  విరాజిల్లి, ఉద్యాన వనాలతో భాసిల్లిన ఆ కోట నేడు కళా విహీనం గా ఎందుకు మారింది? యువరాజు కు తమ సొంత చరిత తెలియక,  చరిత్ర హీనుడిగా ఎందుకు మిగిలిపోయాడు?
                                                       
యువరాజా, మీ దర్సర్ధనార్ధం కవి గారు వేంచేశారు అన్నాడు సేవకుడు. ఎవడ్రా? అరిచాడు విసురుగా యువరాజు.కవిగారు మహాప్రభో అన్నాడు సేవకుడు "నీ యంకమ్మ కవిగాడా! వాడికి అంత సీన్ లేదు, మూసుకుని వెళ్ళమను."  విసుక్కున్నాడు యువరాజు. అంతలోనే వచ్చాడు మంత్రి" యువరాజా   రేపు మీ జన్మ దిన వేడుకలు ఘనంగా జరపడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి అయినవి." అన్నాడు. సాంస్కృతిక కార్యక్రమముల గురించి ఒక భారత నాట్య నర్తకి...మంత్రి ఇంకా పూర్తి చేయకుండానే

 "ఎం మంత్రి ? నీకు నేను అంత ఎర్రి పుష్పం లా కనిపిస్తున్నానా?"అన్నాడు  యువరాజు " పోనీ కూచిపూడి నర్తికీ మణి.." నసిగాడు మంత్రి. చిర్రెత్తుకొచ్చింది యువర్రాజు కి "హే, ఏంటయ్యా ఒక్క సారి చెప్తే అర్ధం కాదా నీకు, కూచిపూడి.. కుప్ప తొట్టి, ఎదవ గోలా  ఈళ్ళూ బుర్ర తినేస్తున్నారు." విరుచుకు పడ్డాడు యువరాజు.  చీవాట్లు తిని వెనుదిరిగిన మంత్రి  రెండు అడుగులు వేయగానే. యువరాజు" మంత్రీ , కే ఎఫ్ సి నుంచి బిర్యానీ, కోక్ తెప్పించు. విష్కీ బాటిల్స్ నాలుగు తెప్పించు." అలాగే" అని మంత్రి వెళ్ళిపోయాడు. అప్పుడే ప్రవేశించాడు సేవకుడు.

 "యువరాజా, కర్నాటక సంగీత సుప్రసిద్ద గాయకుడు " శూలపాణి " గారు వేంచేశారు." ఎం పాణి రా?  గద్దించాడు యువరాజు  "శూల పాణి " యువరాజా. మళ్ళీ చెప్పేడు సేవకుడు "శూల .. శూల ... నాకు ఇంకోలా వినిపించింది లే!" నవ్వేడు యువరాజు.  ఎలా వినిపించింది రాజా? నాకు కూడా చెప్పండి నేను కూడా నవ్వుకుంటాను.  "నాకు సొల గొట్టం లా వినిపించింది లే. నీ యంకమ్మ ఈ రోజుల్లో యూత్  అవన్నీ వింటారా?" అప్పుడే  ఆకాశంలోంచి పిడుగులా చెప్పా పెట్టకుండా ఊడి పడ్డ సినిమా బంగర్రాజు." ఇంటే ఆడు యూత్ ఎందు కౌతాడు?!"  అన్నాడు వెటకారంగా. బంగార్రాజు కి పూర్తి స్వేచ్చ ఉన్ది. అతను కోట్లకి ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా పోవచ్చు. యువరాజు ఎక్కువ సేపు సినిమా బంగార్రాజు తోనే గడపడానికి ఇష్టపడతాడు. "మన యూత్ కి  కావలసినది ఏంటి బంగార్రాజూ?" వెకిలిగా అడిగిగాడు యువరాజు. " యూత్ కి కావలసింది బూత్, అంటే బూతు" మరింతవెకిలిగా అన్నాడు. సినిమాబంగార్రాజు. "కెవ్వు కేక" అన్నాడు యువరాజు. మళ్ళీ ప్రవేశించాడు సేవకుడు " యువరాజా." అని పిలిచాడు భయంగా.

యువరాజు:ఎరా మళ్ళీ వచ్చావు ? అన్నాడు విసుగ్గా.
సేవకుడు : కళాశాలకు వెళ్ళే సమయము అయినది.
సినిమా బంగార్రాజు: నీ యంకమ్మ, బలిసింది రా నీకు, కోసి కారం పెడతానురోరేయ్.
యువరాజు ఈ మాటలు విని చెప్పలేనంతగా ఆనందించాడు. నువ్వు ఏమ్చేప్పినా బాగుటుంది.

వీటినే పంచ డైలాగ్స్ అంటారు అన్నాడు బంగార్రాజు. అవును మా కళాశాల లో కూడా అందరూ నీ లాగే మాట్లాడతారు. అన్నాడు యువరాజు. "ఇంతకీ సాయంత్రం ఏం ప్లాన్ చేసావు. నీ బర్త్ డే కదా, ఫుల్ పటాస్ ఓకేనా?"అన్నాడు బంగార్రాజు కన్ను కొడుతూ. యువరాజు అర్ధం కానట్టు మొహం పెట్టాడు. "అంటే మందేసేద్దాం అని సాయంత్రం  కోటలో కళా మండపం దగ్గర. " అన్నాడు బంగార్రాజు.

సాయంత్రం చీకటి పడ్డాక ఊరి పెద్దలు, స్నేహితులు, కొంత మంది ఉపాద్యాలు కోటలోకి చ్చారు. కళా మండపం దగ్గర ఎన్నో దేవతా మూర్తుల  విగ్రహాలు ఉన్నాయి. బంగార్రాజు ఒక గ్రూప్ ని తెసుకోచ్చాడు. డాన్సు కార్యక్రమం మొదలయ్యింది..  రింగోల రింగోలా అంటూ ఆడ మగ చిందులేస్తున్నారు. కొంతమంది బంగార్రాజు డాన్సర్స్ హ్సుప్పులు ఇప్పి దేముడి నెత్తి మీద పెట్టారు. ఉపాద్యాయులు అభ్యంతరం చెప్పారు. కానీ బంగార్రాజు చెప్పులు తీయ లేదు. ఇదొక వెరైటీ ఎంటర్టైన్మెంట్ అని యువరాజుని, ప్రేక్షులనీ నమ్మించాడు. 

Sunday, March 22, 2015

అన్ సాన్ స్యుకి

Wish you happy Ugadi." అన్నాడు సూరి. "ఏ రా ఇంగ్లిష్ లో చెపుతున్నావు? ఉగాది శుభాకాంక్షలు అని తెలుగులో చెప్పలేవా?" అన్నాడు వెంకోజీ.  “చెప్పగలను కానీ.. నసిగాడు సూరి " హు మన సంస్కృతిని గౌరవిన్చాలిరా!"పెద్ద పోజు ఇచ్చాడు వెంకోజీ. ఒరేయ్ నువ్వు గానీ ఆ పని చేస్తున్నావా? మన సంప్రదాయ వస్త్రం పంచ ధరించి గౌరవాన్ని చాట గలవా? పొద్దున్నే ఇంట్లో పంచకట్టు కొన్నాను కానీ బయటకోచ్చినప్పుడు బాగోదని..నసిగాడు. "అందుకని జీన్స్ వేసుకొని వచ్చావా?" రెట్టించాడు సూరి."బయటకు వెళ్ళేటప్పుడు ఎవడురా పంచాకట్టుకోనేది?" ఉక్రోషంగా అన్నాడు వెంకోజీ సంస్కృతి సంప్రదాయాలు గురించి ఆలోచించే నువ్వు తప్పక చేయాలి. అన్నట్టు నువ్వు ఆస్తేలియాలో చదివేవు కదా అక్కడ పంచ కట్టు కోవాలని అనిపించలేదా? మెల్లగా అడిగాడు సూరి. "ఇంకా నయం.. ఆస్తేలియాలో  పంచ కట్టా?  ఒరేయ్ అలా ఎవ్వడైనా చేయగలడా?" రెచ్చిపోయాడు  వెంకోజీ.  అయితే నీ కు ఆంగ్ సాన్ సూ కి  కధ చెప్పాలిరా.  ఆంగ్ సాన్ సూ కి  నా ఎవరామె? అన్నాడు వెంకోజీ. ఆక్స్ ఫోర్డ్ లో చదువుతున్నా స్వదేశీ వస్త్రధరాణ వదలలేదు. లుంగీ కట్టి  ప్రొఫెసర్ తో కరచాలనం చేస్తున్న ఈ మహిళా మణి అన్ సాన్ స్యుకి ఫ్రమ్ బర్మా


15 సంవత్సరాలు జైల్లో ఉండడానికి ఒప్పుకొంది గానీ దేశం వదిలి పొతే ఫ్రీడమ్ ఇస్తాము అనా ఒప్పుకోలేదు. 1991 లో నోబుల్ పీస్ ప్రైజ్ తో పాటు 1.3 మిలియన్ల అమెరికన్ డాలర్లు పొంది, ఆ మొత్తాన్ని స్వదేశంలో వైద్య విద్య కోసం వెచ్చించిన ఈమె దేశ సంస్కృతి పట్ల చూబించిన గౌరవం ఆదర్శ నీయం.

మన తల్లితండ్రులు పిల్లలకి మన సంస్కృతి మన సంప్రదాయం ప్రతిబింబించేలా పంచ కట్టుకొని యూనివర్సిటీ కి వెళ్ళమని చెప్పగలరా? విదేశాల్లో చదువుకుంటున్న మన విద్యార్ధులు ఆపని చేయగలరా? పంచాకట్టుకోవాలనే ఆలోచన వస్తే వెన్నులో చలి పుడుతుంది కదా? మరి ఆన్ సాన్ స్యుకి  ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీ లో లుంగీ  ఎలా కట్టుకుంది? ఈ పనులు ఏవీ మన చేయలేమురా, ఊరికనే సంస్కృతి సంప్రదాయాలు అని గొప్పలు చెప్పుకోడం కంటే ఎంతో కొంత ఆచరించడం మేలు.

ఇండియన్ కల్చర్

 ఇండియన్ కల్చర్  గురించి ఒక ఇంజినీరింగ్ కాలేజీలో డిబేట్ జరుగుతోంది. ఇండియన్ కల్చర్ అనగానే చాలా మంది పాల్గొన్నారు.  ఎందుకంటే దేశానికి లిప్ సర్వీస్ చేసే అవకాసం కోసం ఎప్పుడూ సిద్దంగా ఉండే వాళ్ళు ఎక్కువ.  అందరూ చాలా భక్తి ప్రదర్శిస్తున్నారు మాటల్లో. ఇండియన్ కల్చర్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. తెలీకున్నా కూడా  తెలిసినట్టు మాట్లాడే వాళ్ళు ఎక్కువ. అందరూ స్త్రీ గురించి తప్ప ఇంకొక్క మాట మాట్లాడలేదు. స్త్రీ వస్త్రధారణ, శీలం ఇది దాటి ముందుకు పోయిన వాళ్ళు చాలా తక్కువ. రూప వంతు వచ్చింది. ఇంట్రోవెర్ట్ అని బాగా పేరు పడిన అమ్మాయి రూప. ఈ అమ్మాయి కి నోట్లో నాలిక లేదు, ఎప్పుడూ మూతి ముడుచుకుని కూచుంటుంది ఈమె ఏమి మాట్లాడుతుంది లే అని అనుకునారు అంతా. రూప మాట్లాడడం మొదలు బెట్టింది. భారతీయ సంస్కృతి చాలా విశాల మైనది, లోతైనది. మిడి మిడి జ్ఞానం తో దాన్ని ఎవరూ అర్ధం చేసుకోలేరు  కల్చర్ అంటే ఆడది ఒళ్ళు కప్పుకోడం, శీలం కాపాడు కోవడం. శీలం అంటే సెక్స్. సినిమాలు చూసి విజ్ఞానం సంపాదించే వాళ్ళు ఇంతకంటే ఎక్కువ ఆలోచించలేరు.  మన కల్చర్ గురించి ఎంతవరకూ  మనకు ఎంత వరకూ అర్ధము అయ్యింది ? ఒక పక్క నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయి మరో పక్క రేప్ లు స్త్రీల మీద దౌర్జన్యాలు జరుగుతుంటాయి

  నేల మీద కూర్చుని భోజనం చేయడం, అథిదులని ఆదరించడం నుంచి పుట్టినరోజులు మన పద్ధతి లో  జరుపుకోడం దుస్తులు ధరించడం. ఇదంతా ఇండియన్ కల్చర్ కాదా?కానీ అవేమీ మనకు గుర్తు రావు.   మన దుస్తులను ధరించడం మరిచిపొయాము.  కల్చర్ అంటే ఆడది ఒళ్ళు కప్పుకోడం, శీలం కాపాడు కోవడం. మన కాలేజీలో మనం నమస్కారం అని పలకరించుకోలేము. గుడ్ మార్నింగ్ అనే విదేశీ సంస్కృతి ఇక్కడ నడుస్తోంది. కాలేజీ బయట కూడా హాయ్ బై లేకదా. కాలేజీలో పుట్టినరోజు జరుపుకునే వాళ్ళు కేక్స్ కట్ చేసి , మోఖాలకి క్రీం పూసుకుని జరుపుకుంటున్నారు. ఇదేనా ఇండియన్ కల్చర్?సభలో కొంచం అసహనం గ్రహించింది రూప.   ఒక చిన్న జరిగిన కదా చెప్తాను అంది. కొంచం ఆసక్తి తొంగి చూసింది అందరి మొహాల్లో 

ఒక తండ్రికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. కొడుకు ప్రభుత్వ ఉద్యోగి. కూతురు చదువు కుంటున్నాది. ఒక రోజు కూతురు తన బాయ్ ఫ్రెండ్ తో ఫోన్లో మాట్లాడడం తనది గమనిస్తాడు. కూతురికి బాగా బుద్ధులు చెప్పి మందలించి న తండ్రి తన కొడుకు అదే రోజు ఆఫీస్ నుచి  లంచం గుంజుకొస్తే ఏమీ మాట్లాడడు. లంచం ప్రభుత్వోజ్యోగుల జన్మ హక్కు అన్నట్టు. లంచం పుచ్చుకుంటే ఇండియన్ కల్చర్ పాడయిపోదా? అని అడిగింది ఆ కూతురు. ఆ తండ్రికి చాలా కోపం వచ్చింది. ఆ కూతురుకి కూడా చాలా బాధ కలిగింది. తండ్రి కూతురిని అర్ధం చేసుకోకుండా చాలా ఇరుకుగా ఆలోచిస్తున్నదుకు. అందరి మొఖాల్లో ఆసక్తి అలుముకుంది, గదిలో నిశ్శబ్దం అలుముకుంది. ఒక్క నిమిషం ఆగి... చెప్పింది ... ఆ కూతురు నేనే. 

గుర్తింపు

వివేకానందుడి జన్మ దినోత్సవం ఈ సందర్బంగా ఈ రోజు ఉపన్యాసం, వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నారు పాల్గొనేవాళ్లు పేర్లు ఇవ్వచ్చు అన్నారు, సోషల్ టీచర్. చాల మంది పేర్లు ఇచ్చారు హేమ కి  వక్తృత్వం లో ఆసక్తి, సరిత కి వ్యాస రచన లో ఆసక్తి. ఆయా పోటీలకు వాళ్ళు తమ పేర్లు ఇచ్చారు. 

వివేకానందుడు షికాగో ఉపన్యాసాల మీద అందరు గొప్పగా మాట్లాడారు . పార్లమెంట్ అఫ్ రిలిజియన్స్ లో వివేకానందుడి ఉపన్యాసం గురించి మాట్లాడుతూ హేమ,  జె హెచ్ . రైట్ అనే హార్వార్డ్ ప్రొఫెసర్ గుర్తించ బట్టే వివేకానందుడు ప్రపంచ ఖ్యాతి పొందాడని, నిజానికి రామానుజన్ కూడా ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు గా గుర్తింపు పొందినది కూడా ఒక పరాయి దేశంలోనే.  జి. హెచ్ . హార్డీ అనే లండన్ కి చెందిన ఒక ప్రొఫెసర్ గుర్తించడం వల్లే రామానుజన్ ఫెలో ఆఫ్  రాయల్ సొసైటీ కూడా కాగలిగాడు అని చెప్పుకొచ్చింది.  

 హేమ బాగా మాట్లాడిందని అందరూ అంగీకరించారు. హేమ కి మొదటి బహుమతి వచ్చిన్ది. సరిత వ్యాసరచన చాలా బాగుంది అని మెచ్చుకుంటూనే చివర్లో సరిత అడిగిన ప్రశ్న బాగో లేదని సరితకు ఏ ప్రైజ్ కూడా ఇవ్వలేదు. సరిత ఏమీ బాధ పడలేదు. కానీ హేమ బాధపడింది. "చివర్లో ఎం రాసావు?"  అని అడిగింది. "విదేశాల్లో ప్రొఫెసర్లు మన వాళ్ళను గుర్తించి ప్రోత్సహిస్తుంటే మనం చంకలు గుద్దు కుంటున్నాం.

 మన ప్రొఫసర్స్ ఎప్పుడైనా విదేశీ విద్యార్ధులను సెరిఫికెట్లు లేకుండా, వాటిని పట్టించుకో కుండా  గుర్తించారా?  పోనీ భారతీయ విద్యార్ధులని గుర్తించిన సందర్భాలు ఉన్నాయా? ఎంతసేపూ మనం ఇంకొకళ్ళ గుర్తింపు కోసం ఎదురుచూడడం కాదు మనం కూడా మంచిని గుర్తించాలి... " మాట్లాడుతోంది సరిత. అబ్బ ఆపవే కొంపలు ములిగిపోతున్నట్టు, అంటూ విసుక్కుంది హేమ. అంతకంటే ఎక్కువే నష్టం జరుగుతుంది, రామానుజన్ టెన్త్ పాస్ అవ్వలేదు అనే ఆలోచించాము కానీ అతనిలో జీనియస్ ని గుర్తిచాలేకపోయాము. 


మద్రాస్ పోర్ట్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో క్లార్క్ గా పనిచేసే అతడి ప్రతిభని విదేశీయులు మాత్రమె గుర్తించగలిగారు. రామానుజన్ ని , వివేకానందున్ని చూసి గర్వ పడే ముందు మనం వ్యక్తుల్లో ప్రతిభని గుర్తించడం నెర్చుకొవాలి. మన విద్యావిధానం లో అటువంటివి జరగటం లేదు  1893 లో ఎలా ఉన్నామో ఇప్పుడూ అలాగే ఉన్నాము. ఇప్పటికీ మన విద్యార్థులు గుర్తింపు కోసం విదేసాలనే ఆశ్రయిస్తున్నారు." కొంపతీసి, ఇవన్నీ నీ వ్యాసంలో రాసావా ?" అన్నాది  హేమ . 

అవును అంది సరిత. ఇంతలో అటెండర్ వచ్చాడు  " ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు " అన్నాడు సరిత తో. 

అమెరికా హరిచ్చంద్రుడు

తెలుగు తరగతి లో పద్యం చదవడం పూర్తి  చేసారు తెలుగు మాస్టారు కందర్ప  కృష్ణమూర్తి గారు.  చదివి  ఇంటర్మీడియట్ విద్యార్ధులకు దాని అర్ధాన్ని వివరించారు.  మనసుకి హత్తుకునేలా పద్యాలని చదవడమే కాకుండా అర్ధాన్ని చక్కటి ఉదాహరణలతో వివరించడం లో మాస్టారిని మించిన వారు లేరు. పరిమితమైన అల్లరి చేయడానికి మాష్టారు అవకాశం ఇస్తారు. పిల్లలకి   అభిప్రాయాలు చెప్పే స్వచ్చ ఇవ్వాలని తద్వారా వాక్చాతుర్యం వృద్ధి పొందుతుంది అని ఆయన విశ్వాసం. 

వంద నూతులకంటే ఒక దిగుడు బావి మేలు 
వంద దిగుడు బావులకంటే ఒక క్రతువు మేలు
వంద క్రతువుల కంటే ఒక సుతుడు మేలు 
వంద సుతులకంటే ఒక సత్య వాక్యము మేలు 

"సత్యవాక్యం యొక్క గొప్పతనం తెలిసిందా?" విద్యార్ధులంతా నవ్వారు.  సత్యం కోసం రాజ్యాన్ని భార్యని వదులుకున్నహరిచ్చంద్రుడు అందుకే గొప్పవాడు అయ్యాడు. అప్పటి నుంచీ ఇప్పటిదాకా అదే కధ. ఎవరో వెనక బెంచీ నుంచి గొణిగారు. పెళ్ళాన్ని అమ్మడం  గొప్పేనా ? మరొక సణుగుడు వినిపించిన్ది. "అవున్రా కట్నాలు పుచ్చుకుని అమ్ముడు పోయే వరుల కంటే నీతి కోసం ఏమైపోయినా తప్పులేదు" మరొకడు అరిచాడు. "ఈ తరం లో కూడా అటువంటివారులేరు కదా?" అన్నారు కొదరు విద్యార్ధులు " ఉన్నారు." అన్నారు మాస్టారు. అలాంటి వాళ్ళా?  అనేక స్వరాలు తరంగం లా లేచాయి  బహుసా అంతకంటే గొప్పవాడే ఉన్నాడు. అతడే 


అమెరికన్ కంప్యుటర్ స్పెషలిస్ట్ సి ఐ ఎ కాంట్రాక్టర్ స్నో డెన్ దేశం కంటే ఎక్కువగా సత్యానికి విలువ ఇచ్చాడు. జననీ, జన్మ భూమిచ్చ స్వర్గాదపీ గరీయసీ... అంటే అందరికీ తెలుసు కదా. అంటే కన్నతల్లి కంటే మాత్రు భూమి గొప్పదని. అలాటి మాత్రు భూమి కంటే, తన ప్రాణం కంటే ఎక్కువ విలువిచ్చాడు సత్యానికి.  తన దేశం ఇతరదేశాల సమాచారాన్ని దొంగిలిస్తున్నాదని గ్రహించి తన ప్రాణాలకు తెగించి నిజాన్ని బయట పెట్టాడు. సత్యానికి దేశం కంటే  ప్రాణం కంటే విలువ ఇచ్చాడు.  పిల్లలు అందరూ చప్పట్లు కొట్టారు. చప్పట్లు ముగియగానే  మాస్టారు  స్నో డెన్ సత్య హరిచ్చంద్రుడు లాగే నేటి తరానికి ఆచరణ యోగ్యుడు."అన్నారు.

అమ్మ నేర్పిన విలువలు

అమెరికా నుంచి కొడుకు  ఫోన్ కాల్ 

హలో.. అమ్మా నేను అమెరికా నుంచి 

బాబు బాగున్నావా!

ఆ ఏదో ఉన్నానులే.. నిన్న మా ఆవిడకి కాల్ చేసావా?

అవున్రా ఏం ?

 నిన్న ఫోనులో  నా పెళ్ళానికి  విలువలు లేవన్నవటగా!

  అది చెప్పిందా ?  అవును అంటే ఏం  తలతీసి మొలేస్తావా 


  అది చెపితే మాత్రం నేనేందుకు చేస్తాను. ఎంతైనా  నీ కొడుకుని కదమ్మా

 అమ్మా నువ్వు నేర్పిన విలువలే నాకు వచ్చాయి. కార్పరేట్ స్కూల్ లో వేసి ఆది వారం సోమవారం అని చూడకుండా బండకేసి బాదిన్చావు. నీ మాటల్లో ఏంటో తియ్యదనం కురిపిస్తావు నీ చేతల్లో అది ఎక్కడా కనిపించవు. ఆట పాటలు చంకనాకి పోయాయని నేను భాద పడుతుంటే, నా కొడుకు ఇంగ్లీష్ మీడియం లో చదువుతున్నాడని ఎంతో గొప్పగా ఫీల్ అయ్యే దానివి. 

నాకు తెలుగుపద్యాలు , కవితలన్నా చాలా ఇష్టం అయినా నన్ను నా భవిష్యత్ కోసం అని ఇంగ్లిష్ మీడియం లోనే చదువుకోవాలనే దానివి. ఎవరైనా తెలుగు మీడియం లో చదువుతుంటే " తెలుగు ఎందుకు వేస్ట్ " అనే దానివి. 

సందర్భం వచ్చినప్పుడు మాత్రం చటుక్కున డైలాగ్ మార్చేసి తెలుగు మీద ప్రేమ కురిపించే దానివి. గొప్పపొలిటీషన్వి అమ్మా నువ్వు. క్షమించమ్మా నిజం మాట్లాడడం ఇండియాలో తప్పే కాని నేను ఇప్పుడు ఇండియాలో లేను కదా.  అమెరికా లో ఉన్నాను. 

అది కూడా నీ చలవే కదమ్మా. కొడుకు అమెరికా లో ఉన్నాడని గొప్పగా చెప్పుకో. చిన్నపుడు మాత్రు భాషని వద్దని అన్నావు తరువాత మాత్రు భూమి వద్దు అని అమెరికా తోలావు. అందిరి అమెరికా గొప్పలు చెప్తూ ఉండేదానివి ఇప్పుడు నీ కొడుకు అమెరిక గొప్పలు చెప్పుకో వచ్చు. సందర్భం వచ్చినప్పుడు మాత్రు దేశం, దేశభక్తి గురించి ఎంతైనా చెప్పవచ్చు.

 ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిన్న ఫోనులో నా పెళ్ళానికి విలువలు లేవు అన్నావు అట కదా. నాన్న చేత వేరు కుంపటి పెట్టించింది నువ్వు కాదా? అత్తా మామలకి చాకిరీ చేయబడుతుంది అని నాన్న చేత నానా అబద్దాలు ఆడించి వేరు కాపురం పెట్టించింది నువ్వు కాదా? చివరి దాకా ఉండేది పెళ్ళామే అనేదానివి కదా. నేను అదే అంటున్నాను. నీ బాటలోనే నడుస్తున్నాను. నీవిలువలె నాకూ వచ్చాయి. నా పెళ్ళాన్ని ఇంకొక్క మాట అన్నావో ఖబ్దార్ ..