Wish you happy Ugadi." అన్నాడు సూరి. "ఏ రా ఇంగ్లిష్ లో చెపుతున్నావు? ఉగాది శుభాకాంక్షలు అని తెలుగులో చెప్పలేవా?" అన్నాడు వెంకోజీ. “చెప్పగలను కానీ.. నసిగాడు సూరి " హు మన సంస్కృతిని గౌరవిన్చాలిరా!"పెద్ద పోజు ఇచ్చాడు వెంకోజీ. ఒరేయ్ నువ్వు గానీ ఆ పని చేస్తున్నావా? మన సంప్రదాయ వస్త్రం పంచ ధరించి గౌరవాన్ని చాట గలవా? పొద్దున్నే ఇంట్లో పంచకట్టు కొన్నాను కానీ బయటకోచ్చినప్పుడు బాగోదని..నసిగాడు. "అందుకని జీన్స్ వేసుకొని వచ్చావా?" రెట్టించాడు సూరి."బయటకు వెళ్ళేటప్పుడు ఎవడురా పంచాకట్టుకోనేది?" ఉక్రోషంగా అన్నాడు వెంకోజీ సంస్కృతి సంప్రదాయాలు గురించి ఆలోచించే నువ్వు తప్పక చేయాలి. అన్నట్టు నువ్వు ఆస్తేలియాలో చదివేవు కదా అక్కడ పంచ కట్టు కోవాలని అనిపించలేదా? మెల్లగా అడిగాడు సూరి. "ఇంకా నయం.. ఆస్తేలియాలో పంచ కట్టా? ఒరేయ్ అలా ఎవ్వడైనా చేయగలడా?" రెచ్చిపోయాడు వెంకోజీ. అయితే నీ కు ఆంగ్ సాన్ సూ కి కధ చెప్పాలిరా. ఆంగ్ సాన్ సూ కి నా ఎవరామె? అన్నాడు వెంకోజీ. ఆక్స్ ఫోర్డ్ లో చదువుతున్నా స్వదేశీ వస్త్రధరాణ వదలలేదు. లుంగీ కట్టి ప్రొఫెసర్ తో కరచాలనం చేస్తున్న ఈ మహిళా మణి అన్ సాన్ స్యుకి ఫ్రమ్ బర్మా
15 సంవత్సరాలు జైల్లో ఉండడానికి ఒప్పుకొంది గానీ దేశం వదిలి పొతే ఫ్రీడమ్ ఇస్తాము అనా ఒప్పుకోలేదు. 1991 లో నోబుల్ పీస్ ప్రైజ్ తో పాటు 1.3 మిలియన్ల అమెరికన్ డాలర్లు పొంది, ఆ మొత్తాన్ని స్వదేశంలో వైద్య విద్య కోసం వెచ్చించిన ఈమె దేశ సంస్కృతి పట్ల చూబించిన గౌరవం ఆదర్శ నీయం.
మన తల్లితండ్రులు పిల్లలకి మన సంస్కృతి మన సంప్రదాయం ప్రతిబింబించేలా పంచ కట్టుకొని యూనివర్సిటీ కి వెళ్ళమని చెప్పగలరా? విదేశాల్లో చదువుకుంటున్న మన విద్యార్ధులు ఆపని చేయగలరా? పంచాకట్టుకోవాలనే ఆలోచన వస్తే వెన్నులో చలి పుడుతుంది కదా? మరి ఆన్ సాన్ స్యుకి ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీ లో లుంగీ ఎలా కట్టుకుంది? ఈ పనులు ఏవీ మన చేయలేమురా, ఊరికనే సంస్కృతి సంప్రదాయాలు అని గొప్పలు చెప్పుకోడం కంటే ఎంతో కొంత ఆచరించడం మేలు.

No comments:
Post a Comment