మాతృభాషకు సేవ చేయాలనీ , మాతృమూర్తి గొప్పతనాన్ని , మాత్రు భాష ప్రాశస్త్యాన్ని నరాలు తెగ్గొట్టుకుని మాట్లాడేడు వేణుగోపాల్. అతడిని స్టేజ్ దిమ్పేసరికి తాతలు దిగోచ్చేరు. ఎట్టకేలకు వేణుగోపాల్ స్టేజ్ దిగాడు ముత్యాలరావ్ మెల్లగా మైక్ అందుకున్నాడు. అతడిని చూసి మైక్ విరిచేస్తాదేమో అనుకున్నారు అంతా. అలా ఎం జరగలేదు. కూల్ గా రెండు మాటలు మాట్లాడేడు, ప్రాగ్మేటిక్ పీపుల్ - కసిగా అన్నాడు అన్నాజీ. అంటే ఏంట్రా అన్నాడు నానాజీ ? చాలా ప్రాక్టికల్ గా ఉండేవాళ్ళని ప్రాగ్మేటిక్ అంటారు. ఇందాక స్టేజ్ మీద మాట్లాడిన వేణుగోపాల్ గురించేనా? కాదు ఇప్పుడు మాట్లాడుతున్న ముత్యాలరావు గురించి. మాత్రు భాష ని గౌరవించండి సాద్యమైనంత వరకూ , ఆదరించండి వీలుంటే, నేను మాతృభాష కి అవకాశం లేక ఏమీ చేయలేదు. అంటూ తన ఉపన్యాసం ముగించాడు. అన్నాజీ కి అది చాలా తప్పుగా కనిపించింది. నానాజీ కి నవ్వు వచ్చింది. ప్రాగ్మేటిక్ గా అంటే ప్రాక్టికల్ గా ఉండడం లో తప్పు లేదు. కానీ హిపోక్రాటిక్ గా ఉండడం తప్పు, చాలా తప్పు. హిపోక్రసీ అంటే నటన. ఉదాహరణకు వేణుగోపాల్ ఇచ్చిన ప్రసంగం ఇచ్చిన బాగుంది కానీ అతడు మాతృభాషకు అతడు ఏమీ చయ్య లేదు. "అంటే? అన్నాడు అన్నాజీ. నానాజీ చెప్పడం ప్రారంభించాడు.
మాత్రు భాష ని గౌరవించండి, ఆదరించండి అని అడగవద్దు. అది జరగదు, ఎవరూ గౌరవించం అని అనలేరు అలాగే అని నవ్వుతూ పిల్లలని చల్లగా ఇంగ్లిష్ మీడియం లో చదివించుకుంటారునీలా. ఫిలాసఫీ చదువుకునే విద్యార్థుల సంఖ్య టెక్నాలజీ చదువు కునే విద్యార్థుల సంఖ్య లో 2% కూడా ఉండదు. ఫిలాసఫీ చాలా గొప్పదే కావచ్చు. కానీ పనికొచ్చే టెక్నాలజీ చదువుకుంటారు ఎక్కువ మంది. అలా అని ఫిలాసఫీ ని చెడ్డది అని అనరు. మాత్రు భాష కూడా అంతే. మాత్రు భాష ని గౌరవించండి, ఆదరించండి అని అడగి వారిని ఇరకాటంలో పెట్టవద్దు. మాత్రు భాషని గౌరవించండి వంటి నీతి చెప్పేటప్పుడు, మీరు ఏమి చదువుకున్నారు , మీ పిల్లలు ఏమి చదువుకున్నారు ( ఏ భాషలో ). అనేది చెప్పి అప్పుడు ఏ రకంగా ఇతరులు గౌర విన్చాలో తెలియజేయండి. ఆచరించి చూపి ప్రభావితం చేయండి.
No comments:
Post a Comment