వివేకానందుడి జన్మ దినోత్సవం ఈ సందర్బంగా ఈ రోజు ఉపన్యాసం, వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నారు పాల్గొనేవాళ్లు పేర్లు ఇవ్వచ్చు అన్నారు, సోషల్ టీచర్. చాల మంది పేర్లు ఇచ్చారు హేమ కి వక్తృత్వం లో ఆసక్తి, సరిత కి వ్యాస రచన లో ఆసక్తి. ఆయా పోటీలకు వాళ్ళు తమ పేర్లు ఇచ్చారు.
వివేకానందుడు షికాగో ఉపన్యాసాల మీద అందరు గొప్పగా మాట్లాడారు . పార్లమెంట్ అఫ్ రిలిజియన్స్ లో వివేకానందుడి ఉపన్యాసం గురించి మాట్లాడుతూ హేమ, జె హెచ్ . రైట్ అనే హార్వార్డ్ ప్రొఫెసర్ గుర్తించ బట్టే వివేకానందుడు ప్రపంచ ఖ్యాతి పొందాడని, నిజానికి రామానుజన్ కూడా ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు గా గుర్తింపు పొందినది కూడా ఒక పరాయి దేశంలోనే. జి. హెచ్ . హార్డీ అనే లండన్ కి చెందిన ఒక ప్రొఫెసర్ గుర్తించడం వల్లే రామానుజన్ ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ కూడా కాగలిగాడు అని చెప్పుకొచ్చింది.
హేమ బాగా మాట్లాడిందని అందరూ అంగీకరించారు. హేమ కి మొదటి బహుమతి వచ్చిన్ది. సరిత వ్యాసరచన చాలా బాగుంది అని మెచ్చుకుంటూనే చివర్లో సరిత అడిగిన ప్రశ్న బాగో లేదని సరితకు ఏ ప్రైజ్ కూడా ఇవ్వలేదు. సరిత ఏమీ బాధ పడలేదు. కానీ హేమ బాధపడింది. "చివర్లో ఎం రాసావు?" అని అడిగింది. "విదేశాల్లో ప్రొఫెసర్లు మన వాళ్ళను గుర్తించి ప్రోత్సహిస్తుంటే మనం చంకలు గుద్దు కుంటున్నాం.
మన ప్రొఫసర్స్ ఎప్పుడైనా విదేశీ విద్యార్ధులను సెరిఫికెట్లు లేకుండా, వాటిని పట్టించుకో కుండా గుర్తించారా? పోనీ భారతీయ విద్యార్ధులని గుర్తించిన సందర్భాలు ఉన్నాయా? ఎంతసేపూ మనం ఇంకొకళ్ళ గుర్తింపు కోసం ఎదురుచూడడం కాదు మనం కూడా మంచిని గుర్తించాలి... " మాట్లాడుతోంది సరిత. అబ్బ ఆపవే కొంపలు ములిగిపోతున్నట్టు, అంటూ విసుక్కుంది హేమ. అంతకంటే ఎక్కువే నష్టం జరుగుతుంది, రామానుజన్ టెన్త్ పాస్ అవ్వలేదు అనే ఆలోచించాము కానీ అతనిలో జీనియస్ ని గుర్తిచాలేకపోయాము.
మద్రాస్ పోర్ట్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో క్లార్క్ గా పనిచేసే అతడి ప్రతిభని విదేశీయులు మాత్రమె గుర్తించగలిగారు. రామానుజన్ ని , వివేకానందున్ని చూసి గర్వ పడే ముందు మనం వ్యక్తుల్లో ప్రతిభని గుర్తించడం నెర్చుకొవాలి. మన విద్యావిధానం లో అటువంటివి జరగటం లేదు 1893 లో ఎలా ఉన్నామో ఇప్పుడూ అలాగే ఉన్నాము. ఇప్పటికీ మన విద్యార్థులు గుర్తింపు కోసం విదేసాలనే ఆశ్రయిస్తున్నారు." కొంపతీసి, ఇవన్నీ నీ వ్యాసంలో రాసావా ?" అన్నాది హేమ .
అవును అంది సరిత. ఇంతలో అటెండర్ వచ్చాడు " ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు " అన్నాడు సరిత తో.
No comments:
Post a Comment