Monday, May 4, 2015

ఆదర్శ కుటుంబం

విశ్వనాధం సూర్యుదయం చూసి చాలా కాలం అయ్యింది.   ఇంటినుంచి పని చేసి సంపాదించాలని డి టీ. పీ. కోరల్ డ్రా , ఫోటోషాప్ నేర్చుకున్నాడు. తెల్లవారక ముందే నాలుగు గంటలకి లేచి కంప్యూటర్ ఆన్ చేసాడంటే. మహాసముద్రం లో మునిగి పోతాడు. విశాఖపట్నం లో  బీచ్ దగ్గర ఉంటె సముద్రం లోంచి సూర్యోదయం చూడొచ్చని అందరూ అనుకుంటారు. కానీ ఆ అదృష్తం విశ్వనాధంకు లెదు.  సూర్యుడు సముద్రం లోంచి బయటకు వచ్చేటప్పటికే విశ్వనాధం పని అనే మహా సముద్రం లో మునిగిపోయి ఉంటాడు. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. దువ్వాడ అనే చిన్న గ్రామంలో ఏకోపాద్యాయ పాఠ శాలలో టీచర్. తనబదులు ఎవరినో పంపి నప్పేస్తుంటాడు. తప్పనిసరి అవినప్పుడు మాత్రం బడికి వెళ్లి వస్తుంటాడు. ఎక్కువ భాగం బిజీగా ఉంటాడు వడ్డీ వ్యాపారం చేస్తూ.

ఇంక కుటుంబం విషయానికి వస్తే

విశ్వనాదానికి ఇద్దరు పిల్లలు. కృష్ణ , కావ్య. కృష్ణ 10 లోకి వచ్చాడు. కావ్య 9 చదువుతున్నాది.   భార్య  కృష్ణ వేణి కూడా గవర్నమెంట్ ఉజ్జోగాస్తురాలే. ఉజ్జోగం తో పాటుగా  ఆమె కూడా టప్పర్ వేర్, సారీ రోలింగ్ బిజినెస్ చేసి డబ్బు సంపాదిస్తుంది. రాత్రీ పగలూ యంత్రాల్లా పనిచేస్తారు భార్య భర్త. రాత్రి పది అయ్యింది. వచ్చేపోయే కస్టమర్స్, ఎప్పుడూ మొగుతుందే సెల్ ఫోన్. అవును మరి  ఇల్లే దుకాణం.  పిల్లలకి చదువుకోడానికి ఒక రూం కేటాయించారు. అమ్మా ఆకలి అవుతోంది.

 తినీ మని చెప్పానా ? అంది కృష్ణ వేణి.
 అమ్మా ఆదివారం అందరం కలిసి తినోచ్చని చెప్పావు కదా. 
అబ్బా అమ్మని విసిగించకండి. టేబుల్ మీద పెట్టేసింది కదా తీసుకుని తినలేరా. నోటికి తినిపించాలా అంట చిన్న పిల్లలా ? అరిచాడు విశ్వనాధం. 

వచ్చే సంవత్సరం హాస్టల్ లో వేసేస్తాం. అన్నాడు  హాస్టలే నయం  అనిపించింది పిల్లలకి. పిల్లలు వాళ్ళ గదిలోకి పోయి తలుపు వేసుకున్నారు. విశ్వనాధం తన గదిలోకి వెళ్లి పోయి కంప్యూటర్ ముందు కూలబడ్డాడు.

 రాత్రి 11 అయ్యింది ..

భోజనాల టేబుల్ దగ్గర పిశాచాల్లా కూర్చున్నారు విశ్వనాధం కృష్ణవేణి. పిల్లలు తిన్నారా? అడిగింది, తినడం నువ్వు చూడలేదా? అడిగాడు విశ్వనాధం. నేను కొంచం బిజీ గా ఉన్నాను అండీ, నసిగింది కృష్ణవేణి . పెట్టుకుని తినే ఉంటారులే, తినమని చెప్పాను. వచ్చే సంవత్సరం హాస్టల్ లో వేసేద్దాం , అన్నాడు విశ్వనాధం. ఈ సంవత్సరమే వేసేద్దాం అంది కృష్ణవేణి.   ట్రిపుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ లో ఎవరి గదుల్లో వాళ్ళు పడుకున్నారు .  


విశ్వనాధం కృష్ణవేణి పెద్ద వాళ్ళు అయిపోయారు.  వారి కల నెరవేరింది. పిల్లలని అమెరికా పంపించేశారు ., ఆరోజు  కృష్ణవేణి కి  పిల్లలు గుర్తొచ్చి దిగులు చెందింది. పని మానేసి, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి దిగులుగా కూర్చుంది .కృష్ణవేణి మేన మామ వెదురుపాక సిద్దాంతి  వాళ్ళింటికి వచ్చాడు.    విశ్వనాధం కృష్ణవేణి దిగులు పడ్డం చూసి  అనున యించాడు  " మనం కష్ట బడేది  వాళ్ళ భవిష్యత్ కోసమే కదా. మా తోడల్లుడి కొడుకు కూతురు విదేశాల్లో వుజ్యోగాలు  చేస్తున్నారని ఎంత గొప్ప గా చెప్పుకున్తాడో.  మనం కూడా మన పిల్లలని అలాగే చెప్పుకోవచ్చు"  అన్నాడు విశ్వనాధం. ఆయన్ని అంతా ఎంతో మెచ్చుకున్నారు. వారిది ఆదర్శ కుటుంబం అని అందరూ వేయినోళ్ళ పొగిడారు అన్నాది కృష్ణవేణి. 


ఆయన అదంతా విని, అమ్మా పిల్లలని విదేశాలు పంపకపోతే వచ్చిన నష్టం లేదు, ఎవరితోనో పోటీపడి జీవించడం కంటే హీనం ఇంకొకటి లేదు.  అలాటి కుటుంబాలు పెరిగి పోతున్నాయి. ఒకడ్ని చూసి మరొకడు కిర్రెక్కి  పోతున్నాడు. ఇవి  ఆదర్శ  కుటుంబాలు కాదు., దౌర్భాగ్య కుటుంబాలు.  ఇలాంటి దౌర్భాగ్య కుటుంబాలు పెరిగి పోతున్నాయి.  నేను ఎవరూ లేక , భార్య చని పోయి బిడ్డలు లేక  ఏకాకి జీవితం గడుపుతున్నాను మీకు పిల్లలు  ఉండి  కూడా ఎకాకిజీవితాలు గడుపుతున్నారు,  అని చెప్పాడు.  కృష్ణవేణి కాఫి చేసి ఇచ్చింది 

దగ్గు ఆయాసం అని పెద్ద ఆసుపత్రి లో చూబించుకోమన్నారు  అందుకే  వచ్చాను. అన్నాడు ఆవిడ మేనమావ  విశ్వనాధం కృష్ణవేణి హాస్పటల్ చుట్టూ తిరిగారు. కానీ ఆయన వ్యాధి తగ్గలేదు. హాస్పటల్లోనే కన్ను మూసాడు. ఆయనకీ బ్రతకాలని లేదు. తనగురించి ఏ దిగులు పడలేదు. శవాన్ని ఇంటికి తీసుకొచ్చారు. అందరికీ కబుర్లు పంపారు. కొద్దిపాటి బంధుజనం మాత్రం వచ్చారు. అందులో విశ్వనాధం తోడల్లుడు వెంకట్రావ్ కూడా ఉన్నాడు. ఆరోజు రాత్రి కృష్ణవేణికి విశ్వనాథానికి పిల్లలు దగ్గర  ఉంటే  బాగుండును అనిపించింది. కృష్ణవేణి విశ్వనాథం ఎంతో బాధతో పడుకున్నారు.   


అంత్యక్రియలు పూర్తయిన తరువాత అందరూ కాలినడకన కారు వరకూ వస్తున్నారు. ఎవరు రాలేదు ఎందుకు రాలేదు అని చర్చించుకుంటున్నారు. " వర్ధనం మొగుడ్ని ఆసుపత్రిలో వేసారు, హార్ట్ అటేక్  అట , వర్ధనం ఎలావస్తుంది?  మన వరకు వచ్చేసరికి పిల్లలు కూడా వస్తారని ఆశ లేదు అన్నారు ఎవరో.  ఆ మాట వింటూనే విశ్వనాథం కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లడం పట్టండి  కారెక్కిద్దాం  అంది కృష్ణవేణి . బంధువులలో  ఒక డాక్టర్  విశ్వనాధాన్ని పరిశీలించి అబ్బే  లాభంలేదు  పోయాడు అని తేల్చేసాడు.  అబ్బా స్మశానం దగ్గరలో చచ్చిపోయాడు  ఎంత అదృష్టవంతుడో అన్నాడు ఒక బంధువు.   కృష్ణవేణి కి నెత్తిమీద సుత్తి దెబ్బలా అనిపించింది. ఆశుపత్రికి  కాకపోయినా ఇంటికి తీసుకెళదాం ! అవేం మాటలు అంది కృష్ణవేణి  


మీదంతా చాదస్తం లావున్నాది ఇంట్లో పెట్టుకుని ఎవరి కోసం ఎదురు చూడాలి  ఇక్కడికి తీసుకు రావలసిందే కదా  మీ పిల్లలు అమెరికాలో ఉన్నారు వాళ్ళెందుకొస్తారు ? ఇప్పుడంతా డబుతో లెక్క చూసుకుంటున్నారు  అన్నాడు వెంకట్రావ్ . బాగా  చెప్పారు. కృష్ణవేణి నువ్వు కూడా చచ్చిపోతే ఇద్దరినీ ఒకే సారి కాల్చేస్తాం. కట్టెలు కలిసొస్తాయి . అన్నాడు.  కృష్ణవేణి  కోపం పట్టలేక  ఎగిసి తన్నింది  విశ్వనాథం దబ్బున మంచమీదనుంచి పడ్డాడు. తెల్లారింది.   అంతా  అంత్యక్రియలకు బయలుదేరితే కృష్ణవేణి అమెరికా బయలుదేరింది.   


No comments:

Post a Comment