తెలుగు తరగతి లో పద్యం చదవడం పూర్తి చేసారు తెలుగు మాస్టారు కందర్ప కృష్ణమూర్తి గారు. చదివి ఇంటర్మీడియట్ విద్యార్ధులకు దాని అర్ధాన్ని వివరించారు. మనసుకి హత్తుకునేలా పద్యాలని చదవడమే కాకుండా అర్ధాన్ని చక్కటి ఉదాహరణలతో వివరించడం లో మాస్టారిని మించిన వారు లేరు. పరిమితమైన అల్లరి చేయడానికి మాష్టారు అవకాశం ఇస్తారు. పిల్లలకి అభిప్రాయాలు చెప్పే స్వచ్చ ఇవ్వాలని తద్వారా వాక్చాతుర్యం వృద్ధి పొందుతుంది అని ఆయన విశ్వాసం.
వంద నూతులకంటే ఒక దిగుడు బావి మేలు
వంద దిగుడు బావులకంటే ఒక క్రతువు మేలు
వంద క్రతువుల కంటే ఒక సుతుడు మేలు
వంద సుతులకంటే ఒక సత్య వాక్యము మేలు
"సత్యవాక్యం యొక్క గొప్పతనం తెలిసిందా?" విద్యార్ధులంతా నవ్వారు. సత్యం కోసం రాజ్యాన్ని భార్యని వదులుకున్నహరిచ్చంద్రుడు అందుకే గొప్పవాడు అయ్యాడు. అప్పటి నుంచీ ఇప్పటిదాకా అదే కధ. ఎవరో వెనక బెంచీ నుంచి గొణిగారు. పెళ్ళాన్ని అమ్మడం గొప్పేనా ? మరొక సణుగుడు వినిపించిన్ది. "అవున్రా కట్నాలు పుచ్చుకుని అమ్ముడు పోయే వరుల కంటే నీతి కోసం ఏమైపోయినా తప్పులేదు" మరొకడు అరిచాడు. "ఈ తరం లో కూడా అటువంటివారులేరు కదా?" అన్నారు కొదరు విద్యార్ధులు " ఉన్నారు." అన్నారు మాస్టారు. అలాంటి వాళ్ళా? అనేక స్వరాలు తరంగం లా లేచాయి బహుసా అంతకంటే గొప్పవాడే ఉన్నాడు. అతడే
అమెరికన్ కంప్యుటర్ స్పెషలిస్ట్ సి ఐ ఎ కాంట్రాక్టర్ స్నో డెన్ దేశం కంటే ఎక్కువగా సత్యానికి విలువ ఇచ్చాడు. జననీ, జన్మ భూమిచ్చ స్వర్గాదపీ గరీయసీ... అంటే అందరికీ తెలుసు కదా. అంటే కన్నతల్లి కంటే మాత్రు భూమి గొప్పదని. అలాటి మాత్రు భూమి కంటే, తన ప్రాణం కంటే ఎక్కువ విలువిచ్చాడు సత్యానికి. తన దేశం ఇతరదేశాల సమాచారాన్ని దొంగిలిస్తున్నాదని గ్రహించి తన ప్రాణాలకు తెగించి నిజాన్ని బయట పెట్టాడు. సత్యానికి దేశం కంటే ప్రాణం కంటే విలువ ఇచ్చాడు. పిల్లలు అందరూ చప్పట్లు కొట్టారు. చప్పట్లు ముగియగానే మాస్టారు స్నో డెన్ సత్య హరిచ్చంద్రుడు లాగే నేటి తరానికి ఆచరణ యోగ్యుడు."అన్నారు.

No comments:
Post a Comment