చిన్న పిల్లలు బారులు తీరి ఇటుకలు తలపై పెట్టుకుని నడుస్తున్నారు. పైన ఎండా మంది పోతోంది. వారి చినారి పాదాలు కమిలి పోతున్నాయి. ఆ లైన్ లోనే ఒక చివర నుంచి మరో చివరికి వచ్చే టప్పటికి ఒకొక్క పొరగా వారి బాల్యం ఊది కింద పడుతోంది, వాళ్ళు పెద్ద వాళ్ళుగా ఎదిగి నూగు మీసాలు గడ్డాలతో కనిపిస్తున్నారు. పక్కనే వాళ్ళ తల్లి తండ్రులు ఉన్నా నివారించే ప్రయత్నం చేయడం లేదు. ఒక పిల్ల గుక్కెడు నీళ్ళ కోసం అలమటిస్తున్నాది, ఓ పిల్లవాడు ఒక్క సారి బరువు దింపు కుంటాను అని చిన్న విరామం కోసం వేడుకుంటున్నాడు, " నువ్వు పెద్ద వాడివి అయ్యిన తరువాత అంతా నీడే, నీడ లో కావలిసినంత విశ్రాంతి తీసుకోవచ్చు" అన్నాడు ఒక తండ్రి. " చూడమ్మా నువ్వు త్వరగా నడవక పొతే వెనక పడిపోతావు. చూడు, అందరూ ఎలా ముందుకు వెళ్లి పోతున్నారో!" అందొక తల్లి. చుట్టూ చూడ కుండా కళ్ళకు గంతలు కట్టేశారు. గుడ్డి పరుగు ప్రారంభ మయ్యింది. ఆ పరుగు లో కొంతమంది నేలకొరు గుతున్నారు. అసువులు బాసినివారిని లాగి పారేస్తున్నారు కాపలా దారులు.
పరుగు మాత్ర ఆగలేదు. పసి పాదాలు నెత్తురోడు తున్నాయి. ఆపండి అని అరిచి ఉలిక్కి పది లేచాడు ప్రకాశరావు. రాజేశ్వరి వెంటనే లేచి లైట్ వేసింది. ఎంటండి ? ఏమయ్యింది ? కంగారుగా అడిగింది. ప్రకాశరావు తనకొచ్చిన కల గురించి చెప్పాడు. కొంచెం మంచి నీళ్ళు తాగండి అని మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది రాజేశ్వరి.
పాడు కల. అయినా కల వస్తేనే ఇంత కంగారు పడాలా అంది రాజేశ్వరి. కల కాదె నిజమే. ఇప్పుడు చదువులు షోకు .. నీకు ఇలా చెప్తే అర్ధం కాదు గానీ, నిన్న నాని గాడికి కొన్న బొమ్మ చేతిగడియారం ఇలా పట్రా. అబ్బ .. అంటూ విస్కుక్కున్తూనే తెచ్చి ఇచ్చింది రాజెస్వరి. "ఇది చూసి టైం చెప్పగలవా?" అన్నాడు ప్రకాశరావు " ఇది చూసి ఎలా చెప్తాం ? ఇది షోకు కోసమే, పనికి కాదు." అలాగే అయిపోయాయి నేటి చదువులు. పక్కింటి ప్రతాప్ ని చూడు పీ. జీ చేసి ఇంగ్లీషులో ఒక్క ముక్క చదవలేదు రాయలేదు. ఎదురింటి అబ్బాయి ది బి టెక్ అయ్యిందన్న మాటే గానీ ఎ వుద్యోగం లేకుడా నాలుగేళ్ల నుంచి ఖాళీ గా తిరుగుతున్నాడు.
ఏ జ్ఞానం ఆశించి ఈ చదువులు చదువులు చదివిస్తున్నారు? చాల్లెండి జ్ఞానం కోసం ఎవరూ చదువుకుంటున్నారు? కొలువుల కోసం చదువుకుంటున్నారు గానీ. అయినా మన చిన్నా గాదు ఆ లైఇన్ లో లేదు కదా మీ కెందుకు బాధ. మన చిన్న ఉన్నది కూడా కార్పరేటు స్కూల్ లలోనే కదే! ఇంకా ఏమీ అర్ధం కావడం లేదా?! ఆదివారం క్లాసులు, అర్ధరాత్రి దాకా చదువులు. మార్కులే తప్ప వెధవకి మన పనిమనిషి పైడి తల్లికి ఉన్న లోకజ్ఞానం లేదు.
నిజ మే శాటిలైట్ నుంచి భూమి స్పష్టం గా కనిపించినట్టు ఫారినర్స్ కి మన జీవితాలు కనిపిస్తున్నావు. లోపల కూరుకుపోయి ఉండడం వాళ్ళ మనకి కనిపించడం లేదు. రేపే చిన్నా గాడి విడుదల. అన్నాడు ప్రకాశరావు ఆనందంగా.

No comments:
Post a Comment