Sunday, March 22, 2015

ఇండియన్ కల్చర్

 ఇండియన్ కల్చర్  గురించి ఒక ఇంజినీరింగ్ కాలేజీలో డిబేట్ జరుగుతోంది. ఇండియన్ కల్చర్ అనగానే చాలా మంది పాల్గొన్నారు.  ఎందుకంటే దేశానికి లిప్ సర్వీస్ చేసే అవకాసం కోసం ఎప్పుడూ సిద్దంగా ఉండే వాళ్ళు ఎక్కువ.  అందరూ చాలా భక్తి ప్రదర్శిస్తున్నారు మాటల్లో. ఇండియన్ కల్చర్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. తెలీకున్నా కూడా  తెలిసినట్టు మాట్లాడే వాళ్ళు ఎక్కువ. అందరూ స్త్రీ గురించి తప్ప ఇంకొక్క మాట మాట్లాడలేదు. స్త్రీ వస్త్రధారణ, శీలం ఇది దాటి ముందుకు పోయిన వాళ్ళు చాలా తక్కువ. రూప వంతు వచ్చింది. ఇంట్రోవెర్ట్ అని బాగా పేరు పడిన అమ్మాయి రూప. ఈ అమ్మాయి కి నోట్లో నాలిక లేదు, ఎప్పుడూ మూతి ముడుచుకుని కూచుంటుంది ఈమె ఏమి మాట్లాడుతుంది లే అని అనుకునారు అంతా. రూప మాట్లాడడం మొదలు బెట్టింది. భారతీయ సంస్కృతి చాలా విశాల మైనది, లోతైనది. మిడి మిడి జ్ఞానం తో దాన్ని ఎవరూ అర్ధం చేసుకోలేరు  కల్చర్ అంటే ఆడది ఒళ్ళు కప్పుకోడం, శీలం కాపాడు కోవడం. శీలం అంటే సెక్స్. సినిమాలు చూసి విజ్ఞానం సంపాదించే వాళ్ళు ఇంతకంటే ఎక్కువ ఆలోచించలేరు.  మన కల్చర్ గురించి ఎంతవరకూ  మనకు ఎంత వరకూ అర్ధము అయ్యింది ? ఒక పక్క నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయి మరో పక్క రేప్ లు స్త్రీల మీద దౌర్జన్యాలు జరుగుతుంటాయి

  నేల మీద కూర్చుని భోజనం చేయడం, అథిదులని ఆదరించడం నుంచి పుట్టినరోజులు మన పద్ధతి లో  జరుపుకోడం దుస్తులు ధరించడం. ఇదంతా ఇండియన్ కల్చర్ కాదా?కానీ అవేమీ మనకు గుర్తు రావు.   మన దుస్తులను ధరించడం మరిచిపొయాము.  కల్చర్ అంటే ఆడది ఒళ్ళు కప్పుకోడం, శీలం కాపాడు కోవడం. మన కాలేజీలో మనం నమస్కారం అని పలకరించుకోలేము. గుడ్ మార్నింగ్ అనే విదేశీ సంస్కృతి ఇక్కడ నడుస్తోంది. కాలేజీ బయట కూడా హాయ్ బై లేకదా. కాలేజీలో పుట్టినరోజు జరుపుకునే వాళ్ళు కేక్స్ కట్ చేసి , మోఖాలకి క్రీం పూసుకుని జరుపుకుంటున్నారు. ఇదేనా ఇండియన్ కల్చర్?సభలో కొంచం అసహనం గ్రహించింది రూప.   ఒక చిన్న జరిగిన కదా చెప్తాను అంది. కొంచం ఆసక్తి తొంగి చూసింది అందరి మొహాల్లో 

ఒక తండ్రికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. కొడుకు ప్రభుత్వ ఉద్యోగి. కూతురు చదువు కుంటున్నాది. ఒక రోజు కూతురు తన బాయ్ ఫ్రెండ్ తో ఫోన్లో మాట్లాడడం తనది గమనిస్తాడు. కూతురికి బాగా బుద్ధులు చెప్పి మందలించి న తండ్రి తన కొడుకు అదే రోజు ఆఫీస్ నుచి  లంచం గుంజుకొస్తే ఏమీ మాట్లాడడు. లంచం ప్రభుత్వోజ్యోగుల జన్మ హక్కు అన్నట్టు. లంచం పుచ్చుకుంటే ఇండియన్ కల్చర్ పాడయిపోదా? అని అడిగింది ఆ కూతురు. ఆ తండ్రికి చాలా కోపం వచ్చింది. ఆ కూతురుకి కూడా చాలా బాధ కలిగింది. తండ్రి కూతురిని అర్ధం చేసుకోకుండా చాలా ఇరుకుగా ఆలోచిస్తున్నదుకు. అందరి మొఖాల్లో ఆసక్తి అలుముకుంది, గదిలో నిశ్శబ్దం అలుముకుంది. ఒక్క నిమిషం ఆగి... చెప్పింది ... ఆ కూతురు నేనే. 

No comments:

Post a Comment