ఉదయాన్నే ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు కొట్టుకుంటున్నారు కాలేజీ ప్రెమిసెస్ లో చుట్టూ చాలా మంది పోగయ్యారు. ఒరేయ్ ఫణి ఎందుకురా కొట్లాట? అరిచాడు మస్తాన్. ఎవరో ఒక చిత్ర కారుడు సరస్వతి దేవి చిత్రాన్ని నగ్నంగా వేసాడు.అది చూసి బాగుంది అని చప్పట్లు కొట్టాను అందుకే వివేక్ నన్ను కొట్టాడు అన్నాడు ఫణి. క్లాస్స్ అంతా గుమ్మి గూడింది. వద్దని వారిస్తున్నా వాళ్ళు కొట్టుకోడ ఆపలెదు. ఒరేయ్ బొమ్మ బాగుంది ఎంజాయ్ చేస్తున్నాను ఇందులో తప్పేముంది రా ? అన్నాడు ఫణి."
తప్పా తప్పున్నరా? సరస్వతిని అవమానిస్తుంటే ... బుర్రలేదురా?" అన్నాడు ఒకడు. "వాడికి వివేకంముంది కాబట్టే కొట్టేడు." అన్నాడు ఇంకొకడు. "జ్ఞాన స్వరూపిణి గా భావించి చదువుల తల్లి గా కొలిచే సరస్వతి ని అవమానిస్తే చూసి ఆనందిస్తున్నావా ? మనిషి వా పశువ్వా?"అన్నాడు అర్జున్ . "ఒరేయ్ అర్జున్ నవ్వెనా, నా క్లోస్ ఫ్రెండే నా ఇలా మాట్లాడేది!!" అన్నాడు ఫణి. "మాట్లాడడమే కాదురా తంతాను కూడా" గట్టిగా కర్ర విరిచేశాడు అర్జున్. "మీ అందరిదీ అదే మాటా?" అన్నాడు ఫణి అందరి వైపూ చూస్తూ. "ఆ అంతే, మామాట కూడా అదేమాట." సరస్వతిని అవమానిస్తే తన్నొచ్చన్న మాట. అని కామ్ గా జేబులో చేయి పెట్టి మొబైల్ తీసాడు. ఏంచేస్తున్నాడో ఎవరికీ అర్ధం కాలేదు. అయితే ఇది చూడండిరా అని ఒక వీడియో ప్లే చేసాడు. పాట కు యువత చిందులు వేస్తున్నారు. ఆ చూస్తున్నావారే ఆ చిందులు వేసే వారు. ఆ పాట
హిస్టరీ లెక్చరున్ది , మిస్టరీ పిక్చరున్ది రెంటిలో ఏది బెస్ట్ రా?
బోటనీ పాఠమున్ది మేటనీ ఆట ఉంది రెంటిలో ఏది బెస్ట్ రా?
హిస్టరీ రొస్టు కంటే రెస్టు మేలు, బోటనీ పాఠ మంటే బోరు బోరు
"నిన్న మీరు ఈ పాటకే కదా చిన్దులేసారు. ఇది తప్పు కాదా?"స్వరం పెంచాడు ఫణి. అది పాటే కదా అన్నాడు ఒకడు. ఇది బొమ్మే కదా అన్నాడు ఫణి
అప్పుడే ప్రిన్సిపాల్ గారు వచ్చారు "సరస్వతి దేవిని చదువుకునే విద్యార్ధులే అవమానించడమా !!
హుస్సేన్ సరస్వతి దేవి ని చిత్రినిన తీరుకి ఇది ఏమీ భిన్నం గా లేదు. సినిమా పిచ్చిలో ఎంటర్ టైన్మెంట్ మోజులో ఇలాటి పాటలని ఆనందించ కూడదు."అన్నారు
హుస్సేన్ సరస్వతి దేవి ని చిత్రినిన తీరుకి ఇది ఏమీ భిన్నం గా లేదు. సినిమా పిచ్చిలో ఎంటర్ టైన్మెంట్ మోజులో ఇలాటి పాటలని ఆనందించ కూడదు."అన్నారు

No comments:
Post a Comment