రెండు కోట్లు విలువ చేసే పొలం ఉంది. పది లక్షలు అప్పు పుట్టక ఒక కోటీశ్వరుడు ఇబ్బంది పడుతున్నాడు అంటే దేన్నేమనాలి? అన్నాడు సర్వేస్వర్రావ్. విధి అంటే ఇదే అన్నాడు జోగారావ్. ఇప్పటికి ఈమాట చాలాసార్లు విన్నాను. ఇంతకీ ఎవరా కోటీశ్వరుడు? అన్నాడు పున్నారావ్. నేనే అన్నాడు సర్వేస్వరావు. నవ్వాగలేదు పున్నారావ్ కి. పైత్యం అంటే ఇదే. అన్నాడు పున్నారావ్. పున్నారావ్ , కోటీశ్వరుడి కి కూడా బ్యాడ్ పీరియడ్ వుంటుంది. కోటీశ్వరుడు, కోటీశ్వరుడు, అని చెప్పుకుని తిరగడమే గానీ , ఏనాడైనా కోటీశ్వరుడి లా బ్రతికేవా?
No comments:
Post a Comment