రెండవ ప్రపంచ యుద్దానతరం ఈస్ట్ జర్మని రష్యా ఆధీనం లో , వెస్ట్ జర్మనీ అమెరికా ఆధీనం లో ఉన్నాయి. ఈస్ట్ జర్మనీ లో కమ్యునిస్ట్ పాలన వల్ల ప్రజలు తీవ్ర అణిచివేతకు గురి అయ్యారు.
The Big Three—Soviet leader Joseph Stalin, British Prime Minister Winston Churchill and U.S. President Harry Truman—met in Potsdam, Germany, from July 17 to August 2, 1945, to negotiate terms for the end of World War II and post war reconstruction on the European continent.
ఇది ఆదిపత్య పోరు, వాటాలపంపకం కోసం జరిగిన మీటింగ్. కానీ చరిత్రలో జర్మనీ పునర్నిర్మాణం కోసం జరిగిన సదస్సుగా చెప్తారు.
1961 ఆగస్ట్ 13 న ఈస్ట్ జర్మనీ నుచి వెస్ట్ జర్మనీ లోకి తప్పించుకుని పోయే వారని నిరోధించడానికి బెర్లిన్ బోర్డర్ ని మూసివేసింది . బంధు మిత్రులను చూడడానికి , తమ వారిని కలుసు కోవడానికి ప్రాణాలకు తెగిన్చ్చి అనేకులు గోడ దాటడానికి ప్రయత్నించారు. 1000 మందికి పైగా ఈ గోడ దాటే ప్రయత్నంలో చనిపోయారు. 138 మంది కాల్చి వేయబడ్డారు.
1948 తరువాత వెస్ట్ బెర్లిన్ కి USA నుండి ఆర్థిక సహాయం వల్ల వెస్ట్ లో జీవితం ఈస్ట్ వెస్ట్ జర్మనీ కంటే మెరుగ్గా ఉంది. జూన్ 1961 లో, కృశ్చెవ్ పాశ్చాత్య దళాలు తొలగించ కాపోతే వెస్ట్ బెర్లిన్, ని దిగ్బంధం చేస్తానని అధ్యక్షుడు జాన్ F. కెన్నెడీ ని హెచ్చరించారు. కమ్యూనిస్టులు పశ్చిమ బెర్లిన్ కత్తిరించుకోవడం బదులుగా తూర్పు బెర్లిన్ కి గోడ కట్టడం వార్తను విన్న కెన్నెడీ ," ఇది ఒక మంచిపని పరిష్కారం కాదు కానీ ఒక గోడ ఒక యుద్ధం కంటే మెరుగైనదే కదా అన్నారు"
కానీ ఆంధ్రా తెలంగాణ మద్య కూడా గోడ కట్టబడింది. బెర్లిన్ వాల్ ని జర్మన్లు కట్టుకోలేదు విదేశీయులు కటారు. గోడ కట్టబదినప్పటికి అక్కడ ప్రజల మద్య విబేధాలు లేవు. వారు ఒకరిని ఒకరు ద్వేశిచుకోలేదు. తామంతా ఒకే జాతి అనే భావనలో ఉన్నారు.ఆంద్ర తెలంగాణాల మద్య కట్టబడిన గోడ బెల్రిన్ వాల్ లాగ భౌతిక మైనది కాదు. దీన్ని కట్టినది విదేశీయులు కాదు. మన రాజకీయ నాయకులచే ,ప్రజల మనస్సులో కట్టబడినది. ఆంధ్రావాళ్ళు దోపిడీ దారులు అనే భావనే ఈ గోడకు పునాది గా నిలిచింది. ఆ గోడను 1990 లో కూల్చి వేసారు కానీ ఆంద్ర తెలంగాణాల మద్య గోడను ఎలా కూల్చగలం?

No comments:
Post a Comment