వేసవి సెలవలు రానే వచ్చాయి. రుబ్బుడు యంత్రం లాంటి స్కూల్ ఆగలేక ఆగలేక ఆగింది. క్వారీ లోనో మిల్లు లోనో పని చేస్తున్నట్టు రోజూ మొఖాలు వేలేసుకుని వచ్చే పిల్లలు రాత్రి కూడా విశ్రాంతి లేక ఓవర్ టైం కార్మికుల్లా పని చేసే వారికి సెలవలంటే ఎడారిలో వాన కురిసినట్టే, ఆకాశం లో ఇంద్రదనస్సు అర చేతిలో వేలిసినట్టే. పోలాకి లో ఉన్న పెదనాన్న ఇంటికి వెళదామా ముంబైలో ఉన్న మేనమామ ఇంటికి వెళదామా అని అల్లోచన తెగలేదు ప్రణీత్ కి, సాయికి . పెదనాన్నని చూసి రండి. పోలాకి వెళితే పొలంలో ఆడుకోవచ్చు. అన్నాడు రాజారావు.
ప్రనీత్ కి తల్లి ఎంత చెప్తే అంత. సాయికి తండ్రి చెప్పినది బాగా నచ్చుతుంది. పోలాకి చాలా చిన్న వూరు సాయీ , ముంబై అయితే పెద్ద సిటీ అన్నీ చూడవచ్చు. రేపు ఎవరైనా ఎక్కడికి వెళ్లావు అని అడిగినా ముంబై అని చెప్పుకుంటే బాగుంటుంది అంది అమ్మ. నేను పల్లెటూరు వెళతాను. వేసవి సెలవల్లో ముంబై లో ఏదైనా కంప్యూటర్ కోర్సు లో చేరి .. పూర్తి చేయక ముందే , పోలాకి వెళతాను పొలంలో ఆడుకుంటాను అన్నాడు సాయి. సరే అంది విశాల. రాజారావ్ పల్లెటూరి మనిషి తెలుగు మీడియం లోనే చదివి సర్వీస్ కమిషన్ పాస్ అయ్యి ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి తృప్తిగా జీవిచాలనుకునే రకం. విశాల ని పెళ్లి చేసుకోక ముందు జీవితం విసాలంగానే ఉండేది. చేసుకున్నాకే ఇరుకు అయిపొయిన్ది.
విసాలకి ఫ్యూచర్ ప్లానింగ్ ఎక్కువ. వర్తమానం కంటే భవిష్యత్తు లోనే బ్రతుకుతుంది. భవిష్యత్ భయంతో బ్రతక కూడదే అని రాజారావ్ యెంత చెప్పినినా టీచర్ ఉద్యోగం లో చేరింది. ఇంటికి వచ్చి కూడా ట్యూషన్లు చెప్పి డబ్బు సంపాదిస్తుంది విశాల. రాజారావ్ నోరెత్తి తే భవిష్యత్ గురించి క్లాస్. భవిష్యత్తా ఎక్కడున్నావ్? అంటూ ఉంటాడు రాజారవ్. ప్రనీత్ నేను ముంబై వెళతానమ్మా అన్నాడు. తను వెళ్ళేది తల్లి గురించే తనగురించి కాదు. సాయి మాత్రం తన నిర్ణయం మార్చుకోలేదు. ఏదో ఒక కోర్స్ చేసి అందరికంటే నువ్వు ముందు ఉండాలి అంది విశాల ప్రనీత్ తో. సరే ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను
అందరూ భోజనాలకి కూర్చున్నారు. మనం ట్రైన్ లో వెళతామా బస్సు లో వెళతామా అన్నాడు ప్రనీత్. హ. హ్హ. హ్హ . ఒరేయ్ ముంబై ఎవడైనా బస్ లో వెళతాడా ? ట్రైన్ లో వెళ్ళాలి అన్నాడు సాయి నవ్వుతూ. అమ్మ వైపు చూసాడు ప్రణీత్. లేదు నాన్న మానం ఫ్లైట్ లో వెళదాము, అంది విశాల. నాన్నా మనం కూడా ఫ్లైట్ లో వెళ్తామా? అన్నాడు. తల్లి , చిన్న కొడుకూ పగలబడి నవ్వారు. తండ్రి కూడా వారితో శృతి కలిపాడు. సాయి భాద పడడం గమనించి మనం వెళ్ళేది పోలాకి పల్లెటూరు కదా, శ్రీకాకుళం దాకా రైల్లో వెళ్లి అక్కడనుంచి బస్సు లో వెళ్ళాలి.
సాయి కి కూడా విమానం లో ప్రయానించాలని ఉంది. మెల్లగా తన పట్టుదల నిర్ణయం సదలిపోయాయి. అమ్మ నేను కూడా ముంబై వెళతానమ్మా అన్నాడు. పల్లె కి వెళ్లి ఆడు కోవాలనే చిన్న కలని చెదరగొట్టడానికి ఒక చిన్న అస్త్రం ప్రయోగించింది. ఆ రాత్రి కలల్లో పొలాల్లో ఆడుకుని ఉండేవాడు సాయి తల్లి విమాన ప్రయోగం చేయక పొతె. మదర్ ప్లాన్ ఆవిడ చేస్తే మాస్టర్ ప్లాన్ స్కూల్ వాళ్ళు చేసారు. భోజానాలు అయ్యి రాజారావ్ కంప్యూటర్ ఆన్ చేసి మెయిల్ చెక్ చేసుకున్నాడు. స్కూల్ నుంచి వేసవి సెలవలు తేదీలు మారినట్టుగా మెయిల్ వచ్చిన్ది. నాలుగు రోజులకి సెలవల్ని కుదించినట్టు మెయిల్. ఇంక వీళ్ళని ఎం పంపుతాం? అన్నాడు విశాలతో రాజారావ్. మనం ఎం చేసినా , స్కూల్ వాళ్ళు ఎం చేసినా పిల్లల భవిష్యత్ కోసమే కదా? అంది విశాల. మీరేమీ ఫీల్ అవ్వక్కరలేదు, నేను వాళ్ళని ఎగ్సిబిషన్ కి తీసుకెళ్ళి అక్కడ చెప్తాను కదా. మై హుమ్నా అన్నట్టు చూసింది. అయ్యో వెల్ల వేసవి సెలవలు పావుగంట లేవు , అన్నాడు రాజారావ్ నిట్టూర్చి. ఇవేమీ తెలియని పిల్లలు తియ్యని కలలలోకి జారు కున్నారు.

No comments:
Post a Comment