బొత్తిగా ఆలోచనా జ్ఞానం లేక అజ్ఞానం లో మగ్గి పోయే వాళ్ళను Nincompoops (నిన్కంపూప్స్) అంటారు. జపాన్,
రష్యా,
అమెరిక నుంచి స్త్రీలు పురుషులు భారత దేశం వచ్చినప్పుడు మన చీరలు పంచలు ధరించవచ్చు.మన దుస్తులు ధరించి మన సంస్కృతీ ,సంప్రదాయాలను గౌరవిస్తున్నారు. అది చూసి వాళ్ళ కల్చర్ కంటే మనకల్చర్ గొప్పది అని ఒక అభూతకల్పనను సృష్టించడం ఆలోచనా జ్ఞానం లేని వాళ్ళు , నాసిరకం మనుషులు చేసే పని. విదేశీయులు వాళ్ళ దేశం తెరిగి వెళ్లి , వాళ్ళ దేశం లో మన వస్త్రాలు ధరించరు. కానీ మనం మాత్రం మన జీవితకాలం విదేశీ వస్త్రాలతోనే జీవిస్తాం.
మన బట్టలు కట్టుకోడం మొదలు పెడితే మన కల్చర్ కు అంకురార్పణ జరుగుతుంది. మనం వారిని మన కంటే అధికులు గానే చూస్తాము మన కల్చర్ని తక్కువగా చూస్తాము. మన కంటే గొప్పవారు అని భావిస్తాం కనుకనే వారి బట్టలు ధరించగలము. స్త్రీలు పురుషల బట్టలు ధరించగలరు. కానీ పురుషులు స్త్రీల బట్టలు ధరించలేరు, ఎందుకు?

No comments:
Post a Comment