Saturday, May 9, 2015

న్యాయం.

ముంబైలోని సతారాకు చెందిన రవీంద్ర  పాటిల్‌కు 25 ఏళ్లు. కష్టపడి కానిస్టేబుల్ అయ్యాడు. ముంబై పోలీసు విభాగంలో ఉద్యోగం. ఆ వెంటనే స్పెషల్ ఆపరేషన్ స్క్వాడ్(ఎస్‌వోఎస్)లో కమాండోగా చేరేం దుకు శిక్షణ. సరిగ్గా ఇదే సమయంలో సల్మాన్‌కు అండర్ వరల్డ్ ముఠాల నుంచి బెదిరింపులు రావడంతో ముంబై పోలీసు విభాగం.. పాటిల్‌ను సల్మాన్‌కు బాడీగార్డ్‌గా పంపింది. 2002 సెప్టెంబర్ 28న సల్మాన్ కారు ప్రమాదం రోజున పాటిల్ అదే వాహనంలో ఉన్నాడు. మద్యం మత్తులో ఉన్నందున కారు నడపొద్దని సల్మాన్‌ను పాటిల్ వారించినా వినలేదు.కారు బయల్దేరిన కాసేపటికే అమెరికా ఎక్స్‌ప్రెస్ బేకరీ సమీపంలోని ఫుట్‌పాత్‌పై పడుకున్నవారిపైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. సల్మాన్ ఖాన్ తన కారు ను ఫుట్ పాత్ పైకి ఎక్కించి ఒకరి మృతికి నలుగురి గాయాలకు కారణ మైన సంఘటనకు ప్రత్యక్ష సాక్షి  రవీంద్ర.  బాడీగార్డ్‌లా కాకుండా ఓ పోలీసులా వ్యవహరించిన పాటిల్ వెంటనే బాంద్రా స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఎఫ్‌ఐఆర్‌లో జరిగింది జరిగినట్టు చెప్పాడు. దీంతోసల్మాన్‌పై కేసు నమోదైంది. ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు కోర్టులో కూడా పాటిల్ సాక్ష్యమిచ్చాడు.

ఆ సాక్షంతో అతని జీవితమే మారిపోయింది. పోలీసు డిపార్ట్ మెంట్ ఎస్ ఓఎస్ ఉద్యోగం నుంచి తప్పించింది. అన్ని వైపుల నుండి పాటిల్ పై తీవ్రమైన వత్తిడులొచ్చాయి. చివరకు స్వంత డిపార్ట్ మెంట్ నుండి కూడా తీవ్రమైన వత్తిళ్ళు వచ్చాయి . పోలీసు డిపార్ట్ మెంట్ మొత్తం ఆయనను ఒంటరిని చేసింది.ఆ వత్తిళ్ళు తట్టుకోవడం ఆయన వల్ల కాలేదు . దాంతో ఉద్యోగానికి కూడా దూరమయ్యాడు. చివరకు ముంబయ్ నుండి దూరంగా వెళ్ళిపోయాడు. అదే సమయంలో సల్మాన్ కేసు విచారణకు వచ్చింది . ఇతను కోర్టుకు రాలేదు.దాంతో కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది .పోలీసులు పాటిల్ ను అరెస్టు చేసి జైలుకు పంపారు. డిపార్ట్ మెంట్ డిస్మిస్ చేసింది. అక్కడే ఆయనకు టీబీ సోకింది.ఆయన జైలు నుండి విడుదలయ్యే సరికి జుట్టు రాలిపోయి ,చిక్కిశల్యమై ఎవ్వరూ గుర్తుపట్టకుండా తయారయ్యాడు.భార్య విడాకులు తీసుకొని వెళ్ళిపోయింది. కొద్దిరోజులు రోడ్డుపై బిచ్చమెత్తుకుంటూ తిరిగాడు. ఆతర్వాత సెవ్రీ లోని టీబీ ఆస్పత్రిలో చేరి 2007, అక్టోబర్ 4న కన్నుమూశాడు. ఆయన నిజాయితీనే ఆయనను కాటికి పంపింది. సల్మాన్ హిట్ అండ్ రన్ కేసు చివరకు ఆయన చావుకు కారణమయ్యింది.

 బాలీవుడ్ ప్రముఖులంతా సల్మాన్ పైనే  జాలి చూపిస్తున్నారు . కానీ  మీడియాలో సల్మాన్ గురించే మాత్రమే వార్తలొస్తున్నాయి .ఈ కేసులో న్యాయం కోసం తన యవ్వనాన్ని, జీవితాన్ని ఫణంగా పెట్టిన ఈ కేసు ముఖ్య సాక్షి గురించి ఎవ్వరూ  పట్టించుకోవడం లేదు. 

Tuesday, May 5, 2015

పావుగంట వేసవి సెలవలు

  వేసవి సెలవలు రానే వచ్చాయి.  రుబ్బుడు యంత్రం లాంటి స్కూల్ ఆగలేక ఆగలేక ఆగింది. క్వారీ లోనో మిల్లు లోనో పని చేస్తున్నట్టు రోజూ మొఖాలు వేలేసుకుని వచ్చే పిల్లలు రాత్రి కూడా విశ్రాంతి లేక ఓవర్ టైం కార్మికుల్లా పని చేసే వారికి  సెలవలంటే ఎడారిలో వాన కురిసినట్టే, ఆకాశం లో ఇంద్రదనస్సు  అర చేతిలో వేలిసినట్టే.  పోలాకి లో ఉన్న పెదనాన్న  ఇంటికి వెళదామా ముంబైలో ఉన్న మేనమామ ఇంటికి వెళదామా అని అల్లోచన తెగలేదు ప్రణీత్ కి, సాయికి . పెదనాన్నని చూసి రండి. పోలాకి వెళితే పొలంలో ఆడుకోవచ్చు. అన్నాడు రాజారావు.

ప్రనీత్ కి తల్లి ఎంత చెప్తే అంత. సాయికి తండ్రి చెప్పినది బాగా నచ్చుతుంది.  పోలాకి చాలా చిన్న వూరు సాయీ , ముంబై అయితే పెద్ద సిటీ  అన్నీ చూడవచ్చు. రేపు ఎవరైనా ఎక్కడికి వెళ్లావు అని అడిగినా ముంబై అని చెప్పుకుంటే బాగుంటుంది అంది అమ్మ. నేను పల్లెటూరు వెళతాను. వేసవి సెలవల్లో ముంబై లో ఏదైనా కంప్యూటర్ కోర్సు లో చేరి .. పూర్తి చేయక ముందే , పోలాకి వెళతాను  పొలంలో ఆడుకుంటాను అన్నాడు సాయి. సరే అంది విశాల. రాజారావ్ పల్లెటూరి మనిషి  తెలుగు మీడియం లోనే చదివి సర్వీస్ కమిషన్ పాస్ అయ్యి ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి తృప్తిగా జీవిచాలనుకునే రకం. విశాల ని పెళ్లి చేసుకోక ముందు  జీవితం విసాలంగానే ఉండేది. చేసుకున్నాకే ఇరుకు అయిపొయిన్ది.

విసాలకి ఫ్యూచర్ ప్లానింగ్ ఎక్కువ. వర్తమానం కంటే భవిష్యత్తు లోనే  బ్రతుకుతుంది. భవిష్యత్ భయంతో బ్రతక కూడదే అని రాజారావ్  యెంత చెప్పినినా   టీచర్ ఉద్యోగం లో చేరింది. ఇంటికి వచ్చి కూడా ట్యూషన్లు చెప్పి డబ్బు సంపాదిస్తుంది విశాల. రాజారావ్ నోరెత్తి తే  భవిష్యత్ గురించి క్లాస్. భవిష్యత్తా ఎక్కడున్నావ్? అంటూ ఉంటాడు రాజారవ్.  ప్రనీత్ నేను ముంబై వెళతానమ్మా అన్నాడు. తను వెళ్ళేది తల్లి గురించే తనగురించి కాదు. సాయి మాత్రం  తన నిర్ణయం మార్చుకోలేదు. ఏదో ఒక కోర్స్ చేసి అందరికంటే నువ్వు ముందు ఉండాలి అంది విశాల ప్రనీత్ తో. సరే ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను

 అందరూ భోజనాలకి కూర్చున్నారు.  మనం ట్రైన్ లో వెళతామా బస్సు లో వెళతామా అన్నాడు ప్రనీత్. హ. హ్హ. హ్హ . ఒరేయ్ ముంబై ఎవడైనా బస్ లో వెళతాడా ? ట్రైన్ లో వెళ్ళాలి అన్నాడు సాయి నవ్వుతూ. అమ్మ వైపు చూసాడు ప్రణీత్. లేదు నాన్న మానం ఫ్లైట్ లో వెళదాము, అంది విశాల.  నాన్నా మనం కూడా ఫ్లైట్ లో వెళ్తామా? అన్నాడు. తల్లి , చిన్న కొడుకూ పగలబడి నవ్వారు. తండ్రి కూడా వారితో శృతి కలిపాడు. సాయి భాద పడడం గమనించి మనం వెళ్ళేది పోలాకి పల్లెటూరు కదా, శ్రీకాకుళం దాకా రైల్లో వెళ్లి అక్కడనుంచి బస్సు  లో వెళ్ళాలి.

సాయి కి కూడా విమానం లో ప్రయానించాలని ఉంది. మెల్లగా తన పట్టుదల నిర్ణయం సదలిపోయాయి. అమ్మ నేను కూడా ముంబై వెళతానమ్మా  అన్నాడు. పల్లె కి వెళ్లి ఆడు కోవాలనే చిన్న కలని చెదరగొట్టడానికి ఒక చిన్న అస్త్రం ప్రయోగించింది. ఆ రాత్రి  కలల్లో పొలాల్లో  ఆడుకుని ఉండేవాడు సాయి తల్లి విమాన ప్రయోగం చేయక పొతె. మదర్ ప్లాన్ ఆవిడ చేస్తే మాస్టర్ ప్లాన్ స్కూల్ వాళ్ళు చేసారు. భోజానాలు అయ్యి రాజారావ్ కంప్యూటర్ ఆన్ చేసి మెయిల్ చెక్ చేసుకున్నాడు. స్కూల్ నుంచి వేసవి సెలవలు తేదీలు మారినట్టుగా మెయిల్ వచ్చిన్ది. నాలుగు రోజులకి సెలవల్ని కుదించినట్టు మెయిల్. ఇంక వీళ్ళని   ఎం పంపుతాం? అన్నాడు విశాలతో రాజారావ్. మనం ఎం చేసినా , స్కూల్ వాళ్ళు ఎం చేసినా పిల్లల భవిష్యత్ కోసమే కదా? అంది విశాల. మీరేమీ ఫీల్ అవ్వక్కరలేదు, నేను వాళ్ళని ఎగ్సిబిషన్ కి తీసుకెళ్ళి అక్కడ చెప్తాను కదా. మై హుమ్నా అన్నట్టు చూసింది.  అయ్యో వెల్ల వేసవి సెలవలు పావుగంట లేవు , అన్నాడు రాజారావ్ నిట్టూర్చి. ఇవేమీ తెలియని పిల్లలు తియ్యని కలలలోకి జారు కున్నారు. 

Monday, May 4, 2015

అంధ విద్యార్ధి


ఆదర్శ కుటుంబం

విశ్వనాధం సూర్యుదయం చూసి చాలా కాలం అయ్యింది.   ఇంటినుంచి పని చేసి సంపాదించాలని డి టీ. పీ. కోరల్ డ్రా , ఫోటోషాప్ నేర్చుకున్నాడు. తెల్లవారక ముందే నాలుగు గంటలకి లేచి కంప్యూటర్ ఆన్ చేసాడంటే. మహాసముద్రం లో మునిగి పోతాడు. విశాఖపట్నం లో  బీచ్ దగ్గర ఉంటె సముద్రం లోంచి సూర్యోదయం చూడొచ్చని అందరూ అనుకుంటారు. కానీ ఆ అదృష్తం విశ్వనాధం కు లెదు.  సూర్యుడు సముద్రం లోంచి బయటకు వచ్చేటప్పటికే విశ్వనాధం పని అనే మహా సముద్రం లో మునిగిపోయి ఉంటాడు. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. దువ్వాడ అనే చిన్న గ్రామంలో ఏకోపాద్యాయ పాఠ శాలలో టీచర్. తనబదులు ఎవరినో పంపి నప్పేస్తుంటాడు. తప్పనిసరి అవినప్పుడు మాత్రం బడికి వెళ్లి వస్తుంటాడు. ఎక్కువ భాగం బిజీగా ఉంటాడు వడ్డీ వ్యాపారం చేస్తూ.

ఇంక కుటుంబం విషయానికి వస్తే

విశ్వనాదానికి ఇద్దరు పిల్లలు. కృష్ణ , కావ్య. కృష్ణ 10 లోకి వచ్చాడు. కావ్య 9 చదువుతున్నాది.   భార్య  కృష్ణ వేణి కూడా గవర్నమెంట్ ఉజ్జోగాస్తురాలే. ఉజ్జోగం తో పాటుగా  ఆమె కూడా టప్పర్ వేర్, సారీ రోలింగ్ బిజినెస్ చేసి డబ్బు సంపాదిస్తుంది. రాత్రీ పగలూ యంత్రాల్లా పనిచేస్తారు భార్య భర్త. రాత్రి పది అయ్యింది. వచ్చేపోయే కస్టమర్స్, ఎప్పుడూ మొగుతుందే సెల్ ఫోన్. అవును మరి  ఇల్లే దుకాణం.  పిల్లలకి చదువుకోడానికి ఒక రూం కేటాయించారు. అమ్మా ఆకలి అవుతోంది. తినీ మని చెప్పానా ? అంది కృష్ణ వేణి. అమ్మా ఆదివారం అందరం కలిసి తినోచ్చని చెప్పావు కదా. అబ్బా అమ్మని విసిగించకండి. టేబుల్ మీద పెట్టేసింది కదా తీసుకుని తినలేరా. నోటికి తినిపించాలా అంట చిన్న పిల్లలా ? అరిచాడు విశ్వనాధం. వచ్చే సంవత్సరం హాస్టల్ లో వేసేస్తాం. అన్నాడు  హాస్టలే నయం  అనిపించింది పిల్లలకి. పిల్లలు వాళ్ళ గదిలోకి పోయి తలుపు వేసుకున్నారు. విశ్వనాధం తన గదిలోకి వెళ్లి పోయి కంప్యూటర్ ముందు కూలబడ్డాడు.

 రాత్రి 11 అయ్యింది ..

 భోజనాల టేబుల్ దగ్గర పిశాచాల్లా కూర్చున్నారు విశ్వనాధం కృష్ణవేణి. పిల్లలు తిన్నారా? అడిగింది, తినడం నువ్వు చూడలేదా? అడిగాడు విశ్వనాధం. నేను కొంచం బిజీ గా ఉన్నాను అండీ, నసిగింది కృష్ణవేణి . పెట్టుకుని తినే ఉంటారులే, తినమని చెప్పాను. వచ్చే సంవత్సరం హాస్టల్ లో వేసేద్దాం , అన్నాడు విశ్వనాధం. ఈ సంవత్సరమే వేసేద్దాం అంది కృష్ణవేణి.  అలా ఉన్నవూర్లోనే హాస్టల్ లో వేసి చదివించారు. పిల్లలు ఎక్కువ ఇబ్బంది పడలేదు ఎందుకంటే ట్రిపుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ లో ఎవరి గదుల్లో వాల్లుదేవారు. ఆదివారాలు కూడా వ్యాపారమే.

కాలం గిర్రున తిరిగింది.
విశ్వనాధం కృష్ణవేణి పెద్ద వాళ్ళు అయిపోయారు.  వారి కల నెరవేరింది. పిల్లలు అమెరిక చేరుకున్నారు.
ఒక రోజు  కృష్ణవేణి మేన మామ వెదురుపాక సిద్దాంతి  వాళ్ళింటికి వచ్చాడు, ఆరోజు  కృష్ణవేణి కి  పిల్లలు గుర్తొచ్చి దిగులు చెందింది. పని మానేసి, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి దిగులుగా కూర్చుంది . విశ్వనాధం  అది గమనించిఅనున యించాడు " మనం కష్ట బడేది  వాళ్ళ భవిష్యత్ కోసమే కదా. మా తోడల్లుడి కొడుకు కూతురు విదేశాల్లో వుజ్యోగాలు  చేస్తున్నారని ఎంత గొప్ప గా చెప్పుకున్తాడో.  మనం కూడా మన పిల్లలని అలాగే విదేశాలు పంపవద్దు?"  అన్నాడు విశ్వనాధం. ఆయన్ని అంతా ఎంతో మెచ్చుకున్నారు. వారిది ఆదర్శ కుటుంబం అని అందరూ వేయినోళ్ళ పొగిడారు అన్నాది కృష్ణవేణి. ఆయన అదంతా విని, అమ్మా పిల్లలని విదేశాలు పంపకపోతే వచ్చిన నష్టం లేదు, ఎవరితోనో పోటీపడి జీవించడం కంటే హీనం ఇంకొకటి లేదు.  అలాటి కుటుంబాలు పెరిగి పోతున్నాయి. ఒకడ్ని చూసి మరొకడు కిర్రెక్కి  పోతున్నాడు. ఇవి ఆదాస కుటుంబాలు కాదు., దౌర్భాగ్య కుటుంబాలు.  ఇలాంటి దౌర్భాగ్య కుటుంబాలు పెరిగి పోతున్నాయి.  నేను ఎవరూ లేక , భార్య చని పోయి బిడ్డలు లేక  ఏకాకి జీవితం గడుపుతున్నాను మీకు పిల్ల ఉంది కూడా ఎకాకిజీవితాలు గడుపుతున్నారు, మంచిది కాదు అని చెప్పాడు. దగ్గు ఆయాసం అని పెద్ద ఆసుపత్రి లో చూబించుకోమన్నారు  అందుకే  వచ్చాను. విశ్వనాధం కృష్ణవేణి హాస్పటల్ చుట్టూ తిరిగారు. కానీ ఆయన వ్యాధి తగ్గలేదు. హాస్పటల్లోనే కన్ను మూసాడు. చనిపోయేముందు ఆయన మరోసారి బిడ్డలు జారత్త అన్నాడు. ఆయనకీ బ్రతకాలని లేదు. తనగురించి ఏ దిగులు పడలేదు.


శవాన్ని ఇంటికి తీసుకొచ్చారు. అందరికీ కబుర్లు పంపారు కొద్దిపాటి బంధుజనం మాత్రం వచ్చారు. అందులో విశ్వనాధం తోడల్లుడు వెంకట్రావ్ కూడా ఉన్నాడు.  అంత్యక్రియలు పూర్తయిన తరువాత అందరూ కాలినడకన కారు వరకూ వస్తున్నారు. ఎవరు రాలేదు ఎందుకు రాలేదు అని చర్చించుకుంటున్నారు. " వర్ధనం మొగుడ్ని ఆసుపత్రిలో వేసారు, హార్ట్ అటేక్, వర్ధనం ఎలావస్తుంది. మన వరకు వచ్చేసరికి పిల్లలు కూడా వస్తారని ఆసలేదు అన్నారు ఎవరో.  అయ్యో మాకు తెలీదే  అన్నాడు విశ్వనాధం. రేపో మాపో కబురు వస్తున్దోమో అనుకుంటున్నాము అన్నరెవరొ. 

కోటీశ్వరులు

రెండు  కోట్లు విలువ చేసే పొలం ఉంది. పది లక్షలు అప్పు పుట్టక ఒక కోటీశ్వరుడు ఇబ్బంది పడుతున్నాడు అంటే దేన్నేమనాలి? అన్నాడు సర్వేస్వర్రావ్. విధి అంటే ఇదే అన్నాడు జోగారావ్. ఇప్పటికి ఈమాట చాలాసార్లు విన్నాను. ఇంతకీ ఎవరా కోటీశ్వరుడు? అన్నాడు పున్నారావ్. నేనే అన్నాడు సర్వేస్వరావు. నవ్వాగలేదు పున్నారావ్ కి.   పైత్యం అంటే ఇదే. అన్నాడు పున్నారావ్. పున్నారావ్ , కోటీశ్వరుడి కి  కూడా బ్యాడ్ పీరియడ్ వుంటుంది. కోటీశ్వరుడు,  కోటీశ్వరుడు, అని చెప్పుకుని తిరగడమే గానీ , ఏనాడైనా కోటీశ్వరుడి లా బ్రతికేవా? 

Sunday, April 12, 2015

మూడు కోణాలు


"నాకు బైక్ కొనక పొతే కాలేజ్ కి వెళ్ళను." గట్టిగా తెగేసి చెప్పాడు. సురేష్. మా ఫ్రెండ్స్ అందరూ ఇంటర్ నుంచే బైక్స్ వాడు తున్నారు . నేను  బీ.టెక్  కి    వచ్చాను గాని ఇంకా బైక్ లేదు. ఇంటర్ లో కొంటాను అని చెప్పి ఇంకా కొనలేదు. "నేను చేసేది కండక్టర్ పని. నాకోచ్చే జీతం ..." నాకు ఎం చెప్పొద్దూ నాన్న ఆవేశంగా బయటకు వెల్లిపోతుండగా వచ్చాడు నరేష్ .పలకరించినా ఆగకుండా వెళ్లి పోయాడు సురెశ్. "మంచి వేడి లో ఉన్నాడు వాడు ఎవరినీ చూసే స్థితిలో లేడు,  లోపలి రా బాబూ" అన్నాడు సురేష్ తండ్రి శంకరం. రెండు రోజుల తరువాత వచ్చాడు సురెశ్. ఈలోగా బిడ్డ ఏమయిపోయాడోనని తల్లడిల్లి పోయింది తల్లి. సురేష్  కు కావలిసింది కూడా అదే. వస్తూనే ముఖం దుమ్మ లాడించాడు సురేష్. బిడ్డను చూస్తూనే బావురుమంది తల్లి. బాబూ ఎక్కడికి వెళ్లి పోయావురా ఏమయిపోయావురా ? ఎడుపుగొంటుతో అడిగుతున్న తల్లిని " ఏమీ అయిపోనులే, చచిపోయాను అనుకున్నావా?" అంటూ ఈసడించాడు తల్లిని. బాబూ నీకు బైక్ .. అనబోతుండగా అక్కడవున్న బైక్ చూసి ఇది ఇక్కడ ఎందుకు ఉంది అన్నాడు సురేష్. ఈరోజు నుంచి ఇది నీదేరా అన్నాడు శంకరం. ఇది నరేష్ డి కదా నాది ఎలా అయ్యింది. నేను గోల చేసినప్పుడు రెండురోజులు నాకిచ్చి నన్ను ఊరుకోబెట్టడం .. ఇంతకుముందులా  చేయకు నాన్న నేను చిన్న పిల్లాన్ని కాదు.

Ravuri Bharadwaja,Telugu novelist, short-story writer, poet, critic and a versatile personality, who studied only till 7th class, but wrote 185 books on various social aspects of human life, was awarded the 48th Jnanpith award for the year 2012 which was announced on 17th April, 2013 for his work 'Paakudu Raallu'. He is educated till Class 7 only, However his books are used as course works in B.A, M.A and there have even been several Phd degrees awarded for research on his works. He got honorary doctorates from Andhra, Nagarjuna and Jawaharlal Nehru Technological Universities for his literary prowess. On April 17, 2013, the Indian Government announced the highest literary award, the 'GNANPEETH PURASKAAR' award for his novel, "Paakudu Raallu"(translating to stepping-stones from rocks covered with moss) which is based on the struggles, lives and behind the scenes of film industry people. He thus became the 3rd Telugu poet/writer in as many as 25 years to have won the prestigious award.

Although the lives of Mr. Ravuri bharadwaja and Mr. Shakespeare are dissimilar there are many similarities. Ravuri and Shakespeare both have high level creative genius of distinction. Both are high-school drop outs. Both are well acclaimed writers though shakespeare is predominantly a dramitist and Ravuri is not. Both have left an indelible impression and have been a source for many researchers. most importantly both are source of inspiration to world and a proof of true education. Their lives are silent messages that education is not cribbed barred and moored by the rustic chains of university degrees.

- poolabala

గోడ

 రెండవ ప్రపంచ యుద్దానతరం ఈస్ట్ జర్మని రష్యా ఆధీనం లో  , వెస్ట్ జర్మనీ అమెరికా ఆధీనం లో ఉన్నాయి.  ఈస్ట్  జర్మనీ లో కమ్యునిస్ట్ పాలన వల్ల ప్రజలు  తీవ్ర అణిచివేతకు గురి అయ్యారు.
The Big Three—Soviet leader Joseph Stalin, British Prime Minister Winston Churchill  and U.S. President Harry Truman—met in Potsdam, Germany, from July 17 to August 2, 1945, to negotiate terms for the end of World War II and post war reconstruction on the European continent.  ఇది ఆదిపత్య పోరు, వాటాలపంపకం కోసం జరిగిన మీటింగ్.  కానీ చరిత్రలో జర్మనీ పునర్నిర్మాణం కోసం జరిగిన సదస్సుగా చెప్తారు.

1948 తరువాత వెస్ట్ బెర్లిన్  కి USA నుండి  ఆర్థిక సహాయం వల్ల  వెస్ట్ లో జీవితం ఈస్ట్ వెస్ట్ జర్మనీ కంటే మెరుగ్గా ఉంది. జూన్ 1961 లో, కృశ్చెవ్ పాశ్చాత్య దళాలు తొలగించ కాపోతే    వెస్ట్ బెర్లిన్, ని దిగ్బంధం చేస్తానని    అధ్యక్షుడు జాన్ F. కెన్నెడీ ని  హెచ్చరించారు. కమ్యూనిస్టులు పశ్చిమ బెర్లిన్ కత్తిరించుకోవడం బదులుగా తూర్పు బెర్లిన్ కి  గోడ కట్టడం   వార్తను విన్న కెన్నెడీ ," ఇది ఒక మంచిపని పరిష్కారం కాదు  కానీ ఒక గోడ ఒక యుద్ధం కంటే మెరుగైనదే కదా అన్నారు"
1961 ఆగస్ట్ 13 న ఈస్ట్ జర్మనీ నుచి వెస్ట్ జర్మనీ లోకి తప్పించుకుని పోయే వారని నిరోధించడానికి బెర్లిన్ బోర్డర్ ని మూసివేసింది . బంధు మిత్రులను చూడడానికి , తమ వారిని కలుసు కోవడానికి ప్రాణాలకు తెగిన్చ్చి అనేకులు గోడ దాటడానికి ప్రయత్నించారు.  1000 మందికి పైగా ఈ గోడ దాటే ప్రయత్నంలో చనిపోయారు. 138 మంది కాల్చి వేయబడ్డారు.  కానీ ఆంధ్రా తెలంగాణ మద్య కూడా గోడ కట్టబడింది. బెర్లిన్ వాల్ ని జర్మన్లు కట్టుకోలేదు  విదేశీయులు కటారు. గోడ కట్టబదినప్పటికి అక్కడ ప్రజల మద్య విబేధాలు లేవు. వారు ఒకరిని ఒకరు ద్వేశిచుకోలేదు. తామంతా ఒకే జాతి  అనే భావనలో ఉన్నారు.ఆంద్ర తెలంగాణాల మద్య కట్టబడిన గోడ బెల్రిన్ వాల్ లాగ భౌతిక మైనది కాదు. దీన్ని కట్టినది విదేశీయులు కాదు. మన రాజకీయ నాయకులచే ,ప్రజల మనస్సులో కట్టబడినది. ఆంధ్రావాళ్ళు దోపిడీ దారులు అనే భావనే ఈ గోడకు  పునాది గా నిలిచింది. ఆ గోడను  1990 లో కూల్చి వేసారు  కానీ ఆంద్ర తెలంగాణాల మద్య  గోడను ఎలా కూల్చగలం?